కృష్ణా జిల్లా ఎస్పీ రవీంద్రబాబు ఐపీఎస్ గారికి రాబడిన సమాచారం మేరకు నందిగామ డిఎస్పీ నాగేశ్వర్రెడ్డి సారధ్యంలో నందిగామ రూరల్ సీఐ సతీష్, కంచికచర్ల ఎస్సై రంగనాథ్, చందర్లపాడు ఎస్సై మణికుమార్ ఎస్బి మరియు పోలీస్ సిబ్బందితో కలిసి కంచికచర్ల మండలం గొట్టుముక్కల గ్రామంలో దాడులు నిర్వహించి 27 క్వింటాళ్ల రేషన్ (పిడిఎఫ్) బియ్యాం , మోడల్ కాలనీ లో 4 క్వింటాళ్ల రేషన్ బియ్యం, కునికిన పాడు గ్రామంలో 12 క్వింటాళ్ల రేషన్ బియ్యాన్ని స్వాధీనం చేసుకొని, ముగ్గురు వ్యక్తులను అదుపులోకి తీసుకోవడం జరిగింది. అలాగే కంచికచర్ల మండలం దొనబండ పోలీస్ ఔట్ చెక్ పోస్ట్ వద్ద వాహనాలు తనిఖీలు నిర్వహిస్తుండగా పరిమితికి మించి ఇసుక రవాణా చేస్తున్న రెండు ఇసుక టిప్పర్ లను స్వాధీనం చేసుకొని, ఇద్దరు టిప్పర్ డ్రైవర్లను అదుపులోకి తీసుకోవడం జరిగిందని నందిగామ రూరల్ సీఐ సతీష్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇసుక, గుట్కా, మద్యం తదితర అక్రమ రవాణా లకు పాల్పడేవారు ఎంతటి వారైనా సరే సహించేది లేదని, చట్టపరమైన కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.