అధికారం అలంకారం కావాలి తప్ప అహంకారాన్ని కాదు తెలుసుకో జోగి—
తెదేపా రాష్ట్ర కార్యదర్శి కొత్త నాగేంద్ర కుమార్(నాగ బాబు)
గత ఎన్నికల్లో ఓడిపోయి పత్తా లేకుండ పారిపోయిన నీవా చంద్రబాబుని విమర్శించేది
పిట్టల దొర జోగి జగన్ రాసుకుంటే ప్రజలకు బూడిదే మిగిలింది.
ఈ రోజు కృష్ణా జిల్లా టీడీపీ కార్యాలయం, విజయవాడ నందు జరిగిన మీడియా సమావేశంలో తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి కొత్త నాగేంద్రకుమార్ (నాగబాబు) మాట్లాడుతూ….
అధికారం అలంకారం కావాలే తప్ప అహంకారం కాదని పికె రిపోర్ట్ తో ఓటమి కళ్ళ ముందు కనపడుతుంటే ప్రస్టేషన్ పెరిగిపోయి జరుగుతున్న ఘటనలే ఇవి.
చంద్రబాబు నాయుడు ని కాదు ప్రజలు తరిమేయాలనుకుంటున్నది. తాడేపల్లి పాలస్ వున్న మీ దొర జగన్ రెడ్డినీ అని తెల్సుకోవాలని – తెలుగు దేశం పార్టి రాష్ట్ర కార్యదర్శి కొత్త నాగేంద్ర కుమార్(నాగబాబు) విమర్శించారు.
వైసిపిది రాష్ట్రంలో మెతుకు రాజకీయమా ?అధికార బతుకు రాజకీయమా? అని ఆగ్రహం వ్యక్తం చేశారు.
గడప గడపకు వైసిపి కార్యక్రమంలో ఎమ్మెల్యే లను ప్రజలను నిలదీస్తునందునే వారి దృష్టి మళ్ళించేందుకు వైసిపి గూండాలు కుప్పంలో అలజడలు సృష్టిస్తున్నారని అన్నారు.గత ఎన్నికల్లో ఓడిపోయి పత్తా లేకుండా పోయేనీవా మా నాయకుడైన చంద్రబాబుని విమర్శించేదని అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఓటమి భయంతో ప్రజల్ని తప్పుదారి పట్టించేందుకే రౌడిలతో దాడులు చేయించారని అన్నారు.
పేదవాడి నోటి దగ్గర కూడు లాగేయడం హీనమైన చర్య అని అన్నారు. శత్రువైన మన ఇంటికి వస్తే అన్నం పెట్టడం మన సాప్రదాయమని అటువంటిది అన్నా క్యాంటిన్ ద్వార పేద వాళ్ళకు అన్నం పెడితే ఓర్వలేక నోటి దగ్గర కూడు లాగేశరని ఆవేధన వ్యక్తం చేశారు.
మైలవరంలో ఓడి పోతావని పెడన సీటు ఇచ్చారని అక్కడ ప్రజలు గత ఎన్నికల్లో ఓడిస్తే అధికారం లేదని పారిపొయావని ,మానాయకుడు చంద్రబాబు నాయుడు నీలాగ పారిపోయె రకం కాదని అన్నారు.
కరోనా సమయంలో మాస్కులు లేవన్న దళిత డాక్టర్ కు గుండు కోట్టి సూసైడ్ చేసుకునేలా మీ శాడిజం చూపించారని లజ్జబండ డ్రైన్ బటన్ నాక్కితే మీకు ఏంత వచ్చింది అందరికి తెలుసు అన్నారు.
ఓక్కసారి ఛాన్సని రాష్ట్ర ప్రజలకు సున్నం పెట్టిన ఘనకీర్తి శుక్రవారం జగన్ రెడ్డిదే అని అన్నారు.
మీరు డప్పు కొట్టుకునే మనసున్న మారాజు జగన్ రెడ్డి వేస్తున్న పన్నుల మోతతో ప్రజల మనసులు ఎప్పుడు ఈ దరిద్రాన్ని వదిలించుకోవాలని చూస్తున్నారు అని తెలుసుకో..
ప్రజలు ఎప్పుడు వస్తె అప్పుడు నిన్ను,మీ పార్టీని బంగాళాఖతంలో కలపటానికి సిద్దంగా వున్నారు.
ఇప్పటికైన ప్రజాస్వామ్య పద్దతిలో నడుచుకోవాలని హెచ్చరించారు.