కార్మిక హక్కులు హరిస్తే మోడిని గద్దె దింపుతాం
పభుత్వ రంగ సంస్థల్ని కాపాడుకుందాం డి.వి.కృష్ణ
తెలుగు తేజం, కంచికచర్ల : దేశవ్యాప్తంగా గురువారం జరిగిన సమ్మెలో భాగంగా కంచికచర్ల సిఐటియు కార్యాలయం నుండి ప్రదర్శనగా నెహ్రూ సెంటర్ వరకు నిర్వహించడం జరిగింది. ఈ సమ్మెలో కంచికచర్ల మండలం లో వివిధ రంగాలలో ఉన్న బిల్డింగ్, కాంట్రాక్ట్ ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు, ఆశ, మధ్యాహ్న భోజన పథకం, కార్మికులు, పంచాయితీ, ఆశావర్కర్లు ,వివిధ కాంట్రాక్ట్ ఔట్సోర్సింగ్ ప్రభుత్వ ఆస్పత్రిలో పనిచేసే కార్మికులు సి ఐ టి యు,సిపిఎం పార్టీ ఈ సమ్మెలో పాల్గొన్నారు. అనంతరం నెహ్రూ సెంటర్లో ఏర్పాటు చేసిన సభలో సిపిఎం జిల్లా కార్యదర్శి డి.వి. కృష్ణ మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న ప్రజా కార్మిక రైతు వ్యతిరేక విధానాలు నిరసనగా ఈ రోజు దేశ వ్యాప్తంగా పెద్దయెత్తున సమ్మె నిర్వహించడం జరిగిందన్నారు. ప్రధానమైన ప్రభుత్వ రంగ సంస్థలు బ్యాంక్, ఎల్ఐసి, పోస్టల్, రైల్వే సంస్థల అన్నిటిని కూడా కార్పొరేట్ సంస్థలకు బడా పెట్టుబడిదారులకు అప్పగించే దానికోసం కేంద్ర ప్రభుత్వం చూస్తా ఉంది. ఇది సరైంది కాదు అని డిమాండ్ చేశారు. కార్మిక చట్టాలు 40 గా ఉన్న వాటిని 4 చట్టాలుగా మార్చేసింది. పెట్టుబడిదారులకు పారిశ్రామికవేత్తలకు అనుకూలంగా ఈ ప్రభుత్వం చట్టం చేసింది .కార్మికులకు ఉపయోగపడే విధంగా లేకుండా ఈ చట్టాలు చేశారు ఇది సరైంది కాదని డిమాండ్ చేశారు.ఇటీవల కాలంలో రైతు నష్టపరిచే మూడు ప్రధానమైన వ్యవసాయ చట్టాలు తీసుకొచ్చి రైతులకు ఇబ్బంది కలిగే విధంగా ఈ చట్టంలో మార్పులు చేశారు వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు.
కార్మికులకు ఇచ్చిన జీవో ప్రకారం వేతనాలు అందడం లేదు. *కార్మికులు పెండింగ్లో ఉన్న వేతన బకాయిలు వెంటనే చెల్లించాలని ఆశ పంచాయితీ కార్మికుల ను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని, కాంట్రాక్ట్ ఔట్సోర్సింగ్ గా పనిచేస్తున్న కార్మికులందరికీ ఉద్యోగులకు సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని డిమాండ్ చేశారు.
రబ్బర్ స్టాంపు మోడి సి పి ఎం కంచికచర్ల పట్టణ కార్యదర్శి జి.హరికృష్ణారెడ్డి మాట్లాడుతూ.. మోడి రబ్బర్ స్టాంపు అని ఁపభుత్వాన్ని నడిపేది ,రిలయన్స్ అంబానీ , ఆదానీ లే అన్నారు. కార్మిక హక్కులను కాలరాస్తె ఊరుకోబోమన్నారు. ఈ కార్యక్రమంలో ,డి వై యాప్ ఐ జిల్లా కార్యదర్శి నాగేశ్వరరావు సిపిఎం నాయకులు సయ్యద్ ఖాసిం, కాశి బోయిన రాంబాబు సయ్యిద్ గాలీషొ ఓంటిపులి రాజు మధ్యాహ్న భోజన వర్కర్ నాయకులు వనజాక్షి, సావిత్రమ్మ పంచాయితీ వర్కర్స్ యూనియన్ నాయకులు బెజ్జం భూషణం ఆశా వర్కర్ నాయకురాలు పుల్లమ్మ,మణేమ్మ రోజుమేరి,జవలేశ్వరి బిల్డింగ్ వర్కర్స్ యూనియన్, నాయకులు తాటికొండ వీరయ్య.మర్రిపుడిచిన్నా తోపుడుబండ్ల యూనియన్ అధ్యక్ష కార్యదర్శులు ఆశీర్వాదం వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.