Breaking News

రజిక మహిళకు న్యాయం చేయాలి : జగ్గయ్యపేట తెలుగు మహిళ అధ్యక్షురాలు కన్నెబోయిన రామలక్ష్మీ ప్రసాద్

తెలుగు తేజం, జగ్గయ్యపేట : గుంటూరు జిల్లా నాదెండ్ల మండలం సతలూరు గ్రామంలో స్థలం విషయంలో రోడ్డున పడ్డ బిసి రజక కుటుంబానికి చెందిన మహిళకు అన్యాయం జరుగుతున్న నేపథ్యంలో జాతీయ బిసి సంక్షేమ సంఘం కృష్ణా జిల్లామహిళా అధ్యక్షురాలు, జగ్గయ్యపేట తెలుగు మహిళ అధ్యక్షురాలు కన్నెబోయిన రామలక్ష్మీ ప్రసాద్ మాట్లాడుతూ గత రెండు రోజుల నుండి ఒక బడుగు బలహీన వర్గానికి చెందిన మహిళ,మగ తోడు అంటే భర్త కూడ లేని నిరుపేద మహిళ, తన ఇద్దరు పిల్లలతో సహా, రోడ్డుపై బైఠాయించి,నాకు న్యాయం చేయండి అని , లేకపోతే నేను నా పిల్లలు పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకుంటామని హెచ్చరిక చేస్తూ ఉంటే,కనీసం అదే జిల్లాకు చెందిన మహిళా హోం మంత్రి సుచరిత ఏమీ చేస్తున్నారు. వెంటనే హోమ్ మంత్రి స్పందించి ఆ రజిక మహిళకు, ఆమె పిల్లలకు న్యాయం చేయాలని బిసి సంక్షేమ సంఘం డిమాండ్ చేస్తుంది. వెంటనే మహిళా కమిషన్ చైర్మన్ బాధ్యత గా ఆ మహిళను కలసి సరైన న్యాయం చెయ్యాలి. 30 సంవత్సరాల తరువాత కృష్ణా రెడ్డికి ఆమె హోటల్ నడిపే స్థలం మీద, ఆశ కలిగి ఆమెను ఖాళీ చేయించాలి అని కుట్రలు చేస్తున్నాడు. నిజంగా కృష్ణా రెడ్డిది స్థలం ఐతే ఇన్ని సంవత్సరాలు ఎందుకు అగాడు. మహిళలకు న్యాయం చేయటం మా జగన్ అన్న లక్ష్యం అని పెద్ద ఎత్తున గొప్పలు చెప్పుకుంటున్న అధికార పార్టీ నాయకులు ఇప్పుడు సమాదానం చెప్పండి.
ఇదే గుంటూరు జిల్లా శివాపురం తండాకు చెందిన మహిళ రామావత్ మంత్రుబాయి అనే మహిళను అప్పు కట్ట లేదు అని శ్రీనివాస్ అనే అతను ట్రాక్టర్ తో తొక్కించి చంపడం జరిగింది.ఇప్పుడు ఆమె అప్పు మేము కడతాము.ఆమె ప్రాణాలు తిరిగి మాకు ఇవ్వ గలరా ? మరొకటి ఇదే గుంటూరు జిల్లా లో మున్నంగి గ్రామ నివాసి బిసి వర్గానికి చెందిన శొంఠి సాంబశివరావు భార్యను సభ్య సమాజం తలదించుకొనే విధంగా అసభ్యంగా దూషించిన రమేష్ రెడ్డి,కొమ్మా రెడ్డి,సందీప్ రెడ్డి, ఈ అన్యాయం ఏంటి అని అడిగిన భర్తను అర్ధ నగ్నంగా ఉంచారు. 17 నెలల YSRCP పాలనలో బహుజనులపై, దాడులు,అత్యాచారాలు, వేధింపులు,నిత్యం జరుగుతున్నాయి. వీటి అన్నింటిపై గౌరవ ముఖ్యమంత్రి Y.S. జగన్ మోహన్ రెడ్డి మౌనం వహించడం దూరదృష్టకరం. ముఖ్యమంత్రి బడుగు బలహీన వర్గాల వారిపై జరుగుతున్న దాడులను, అత్యాచారాలను, మౌనం విడిచి వారికి న్యాయం చేయాలని జాతీయ బిసి సంక్షేమ సంఘం కృష్ణా జిల్లా మహిళా అధ్యక్షురాలు కన్నెబోయిన రామలక్ష్మి ప్రసాద్ డిమాండ్ చేశారు.వెంటనే ఇబ్బంది పడుతున్న రజిక మహిళకు ఆమె స్థలం ఇప్పించి ఆమెకు న్యాయం చేయాలి. ఈ ప్రభుత్వం మహిళల విషయంలో పదేపదే ఎన్ని తప్పులు చేస్తున్నా, అమరావతిలో సైతం నిరంతరాయంగా రాజధాని కోసం మహిళలు నిరసన తెలుపుతున్న వారిని సైతం కావాలని అనేక ఇబ్బందులకు గురి చేస్తున్నా, ముఖ్యమంత్రి చూస్తూ ఉండడం చాలా బాధగా అనిపిస్తోంది.సాక్షాత్తు ఒక మహిళ హోం మంత్రిగా పని చేస్తూ ఉన్నప్పటికీ ఈ దుర్ఘటనలు జరగడం చాలా చాలా దారుణం. ఈ వికృత చేష్టలు రాష్ట్రంలో ఎలాంటి పరిపాలనకు నిదర్శనం.ఈ రాష్ట్రంలో మహిళలకు అసలు న్యాయం జరుగుతుందా? అనే అనుమానం ప్రజలకు కలుగుతుంది.ఈ దుర్మార్గాలు ఇదే విధంగా కొనసాగితే ప్రజలలో ఉవ్వెత్తున ఎగసిపడే వ్యతిరేక జ్వాలలలో తట్టుకోలేక అధికార పార్టీ వారు మాడీ మసి అవ్వక తప్పదు. మహిళల కన్నీరు రాష్ట్రానికి శాపం అనే విషయాన్ని గుర్తెరిగి ముఖ్యమంత్రి తక్షణమే దుర్మార్గులను శిక్షించి, అమాయకులకు న్యాయం చేయాలని ఆమె ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

About The Author

Related posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *