గడువు పొడిగిస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం
తెలుగు తేజం, అమరావతి : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. అమ్మఒడి పథకానికి నమోదు చేసుకునేందుకు గడువును పొడిగించింది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. జగనన్న అమ్మఒడి పథకం రెండో విడత విద్యార్థుల చైల్డ్ ఇన్ఫో నమోదును ఈ నెల 19వ తేదీ వరకు పొడిగించామని అధికారులు ప్రకటించారు. ఈ విషయాన్ని హెచ్ఎంలు, విద్యాశాఖ అధికారులు గుర్తించాలన్నారు. కొత్త విద్యార్థుల నమోదు, ఇప్పటికే వచ్చిన దరఖాస్తులను నవీకరణ చేయాలన్నారు. అర్హత ఉన్న తల్లుల జాబితాను ఈనెల 20వ తేదీన సంబంధిత పాఠశాలల్లో ప్రదర్శించడం జరుగుతుందని అధికారులు సదరు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.