విజయవాడ తెలుగు తేజం ప్రతినిధి: పుట్టుక కొందరికే తెలిసిన జీవితం ఎందరికో తెలిసేవిధంగా జన్మ ప్రత్యేకతను నిరూపించుకోవాలని మానవాళికి ప్రబోధిస్తున్నపూర్ణ గురువులు,
ఆధ్యాత్మిక విశ్వ గురువు, వైజ్ఞానిక ఋషి శ్రీ శ్రీ శ్రీ గురు విశ్వ స్ఫూర్తి వారి దివ్య ఆశీస్సులతో దసరా నవరాత్రుల సందర్భంగా స్పూర్తి కుటుంబం ఆధ్వర్యంలో ఆసన ,ప్రాణాయామ, ధ్యాన శిక్షణా తరగతులు గత వారం రోజులుగా ప్రపంచవ్యాప్తంగా జరిగాయి. ఎనిమిదవ రోజు గురువారం ఈ ప్రస్తావన సాధన కార్యక్రమం ముగింపు సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా ఉన్న స్ఫూర్తి గురు పీఠాలలో ముగింపు వేడుకలు అత్యంత భక్తి శ్రద్ధలతో ఘనంగా జరిగాయి. ప్రపంచవ్యాప్తంగా దాదాపు 80 కేంద్రాలలో పలు దేశవిదేశాలలో ఈ వేడుకలు జరిగాయని స్ఫూర్తి కుటుంబం నిర్వాహకులు తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ శ్రీ శ్రీ శ్రీ గురు విశ్వ స్ఫూర్తి వారు భౌతిక ఆధ్యాత్మిక సమన్వయ తే మానవ జీవిత పరిపూర్ణతకు ఉపయోగపడుతుందని తెలిపారు. అలాగే ప్రస్థాన సాధనలో పాల్గొన్న వివిధ భక్తులు మాట్లాడుతూ శ్రీ శ్రీ శ్రీ గురు విశ్వ స్ఫూర్తి వారు అందించిన ఈ దివ్య విధానం మానసిక, ఆరోగ్య సమస్యలకు కు దివ్యౌషధంలా ఉపయోగపడుతుందని పలువురు తమ అభిప్రాయాలను వ్యక్తం చేశారు .అలాగే ఈ ఎనిమిది రోజుల కార్యక్రమంలో శరీరంలో వివిధ రుగ్మతల నివారణకు కావలసిన వివిధ ఆసనాలను యోగ నిష్ణాతులైన డాక్టర్ ప్రతాప్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఆన్లైన్ విధానంలో సాధకులకు శిక్షణ ఇవ్వడం జరిగింది, ప్రపంచవ్యాప్తంగా ఉన్న స్ఫూర్తి కుటుంబ సభ్యులు మరియు ఆన్లైన్ లింకు ద్వారా వారి వారి స్వగృహంలో వేలాది మంది భక్తులు ఈ కార్యక్రమంలో గత ఎనిమిది రోజులుగా పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు నిర్వాహకులు ధన్యవాదాలు తెలిపారు.