తెలుగు తేజం, జగ్గయ్యపేట: జగ్గయ్యపేట పట్టణ పరిధిలోని 17వ వార్డు నాగమయ్య బజార్ కు చెందిన 13 సంవత్సరాల ముస్లిం బాలికకు అధికారులకు ఎవరికీ తెలియకుండా వత్సవాయి గ్రామానికి చెందిన యువకునితో వివాహం జరపడానికి బాలిక తల్లిదండ్రులు ఏర్పాట్లు చేయగా, సమాచారం అందుకున్న ఐ సి డి ఎస్ అధికారులు, అంగన్వాడి టీచర్లు, వాలంటీర్ సిబ్బంది బాల్య వివాహం జరపడం నేరం అని, బాలిక కుటుంబ సభ్యులకు కౌన్సిలింగ్ ఇచ్చి, వారిచేత బాలికకు మేజర్ అయ్యేంతవరకు వివాహం చేయమని హామీ పత్రం రాయించుకొని, మైనర్ బాలికకు వివాహం చేస్తే ఎటువంటి సమస్యలు వస్తాయో వారికి వివరించి, మరోసారి ఇలాంటి మైనర్ వివాహం చేయాలని చూస్తే చట్టపరంగా చర్యలు తీసుకుంటామని తెలియజేశారు,ఈ కార్యక్రమంలో అంగన్వాడీ సూపర్వైజర్ ఉషారాణి, మహిళా మిత్ర లక్ష్మీకాంతం, ఉమెన్ డెవలప్మెంట్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ నుండి జ్యోతి రాణి, ఉమెన్ ప్రొటెక్షన్ సెక్యూరిటీ ఎం సుధారాణి, వార్డ్ అడ్మినిస్ట్రేటివ్ సెక్రటరీ పి నాగరాజు, వాలంటీర్ నవీన్ కుమార్ పాల్గొన్నారు