Breaking News

రాష్ట్ర రవాణాశాఖ ఆదాయానికి గండి కొడితే కఠిన చర్యలు : డిటీసీ యం పురేంద్ర

వ్యక్తిగత వాహనాల అనధికార రవాణాలపై వేటు
దొరికినవి దొరికినట్లు యధాస్థితి లో సీజ్ చేస్తాం
జిల్లా వ్యాప్తంగా 5 ప్రత్యేక తనిఖీ బృందాలను ఏర్పాటు

తెలుగు తేజం , విజయవాడ : రాష్ట్ర రవాణా శాఖ ఆదాయానికి గండి కొట్టే ప్రయత్నం చేసినా , పన్నులు చెల్లించకుండా వాహనాలు తిరిగినా , వదిలిపెట్టేది లేదని డిటీసీ యం పురేంద్ర హెచ్చరించారు. స్థానిక బందరురోడ్డు లోని డిటీసీ కార్యాలయంలో గురువారం నాడు డిటీసీ యం పురేంద్ర మాట్లాడుతూ ఇతర రాష్ట్రాల నుండి వాహనాలు రాష్ట్రంలోకి చొరబడి రాష్ట్రానికి చెల్లించాల్సిన పన్నులు చెల్లించకుండా తిరుగుతున్నాయని, కొందరు ఉద్దేశపూర్వకంగా సొంత వాహనాలు సైతం రవాణా వాహనాలుగా తిప్పుతునట్లు తమ దృష్టికి వచ్చిందని డిటీసీ తెలిపారు. సొంతంగా నడుపుకునే మోటారు కార్లు, మోటార్ సైకిళ్లను రవాణా తరహ వాహనాలుగా మలిచి ప్రయాణికులను చేరవేస్తున్నారని, ఏదైనా ప్రమాదం జరిగితే పూర్తి బాధ్యత వాహన యజమానే వహించవాల్సి ఉంటుందన్నారు. అనాధికారంగా వాహనాలు తిప్పితే కేసులు నమోదు చెయ్యడమే కాకుండా, వాహనాలు అక్కడికక్కడే సీజ్ చెయ్యడం జరుగుతుందని హెచ్చరించారు. రవాణేతర వాహనాలు , మోటారు కార్లను మోటార్ క్యాబ్, మ్యాక్సీ క్యాబ్ లుగా నడుపుతున్నారన్నారు. ఇతర రాష్ట్రాల నుంచి ఎన్ఓసి ద్వారా రాష్ట్రానికి తీసుకొచ్చిన మోటార్ కారులకు రాష్ట్రానికి చెల్లించాల్సిన వాహన జీవితకాలపు పన్నును చెల్లించాల్సి ఉంటుందన్నారు. ప్రయాణికులను చేరవేసే రవాణా వాహనాలకు వాహన ఫిట్నెస్ పర్మిట్ కలిగి ఉండాలన్నారు. పన్నులు చెల్లించకపోయిన, పర్మిట్లు లేకపోయినా అధిక పెనాల్టీలతో చెల్లించాల్సివస్తున్నదని తెలిపారు. ఇటువంటి వాహనాలపై దృష్టి సారించేందుకు జిల్లా వ్యాప్తంగా ప్రత్యేకంగా ఐదు తనిఖీ బృందాలను ఏర్పాటు చేశామని అన్నారు. రోడ్డు భద్రతను దృష్టిలో పెట్టుకొని తనిఖీలు చేపట్టడం జరుగుతుందన్నారు. అనాధికారంగా తిరుగుతూ పట్టుబడ్డ 10 వాహనాలకు సీజ్ చేసి కేసులు నమోదు చేశామన్నారు.

About The Author

Related posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *