Breaking News

దుర్గంచెరువు కేబుల్‌ బ్రిడ్జిపై కారు బోల్తా

మాదాపూర్(హైదరాబాద్‌): నగరంలోని దుర్గంచెరువు కేబుల్‌ వంతెనపై వేగంగా వెళుతున్న ఓ కారు అదుపు తప్పి డివైడర్‌ను ఢీ కొట్టి బోల్తా పడింది. అదృష్టావశాత్తు కారులో ప్రయాణిస్తున్న ఇద్దరూ స్వల్ప గాయాలతో బయటపడ్డారు. ఆసిఫ్‌నగర్‌ ప్రాంతంలో నివాసముంటున్న మహబూబ్‌ ఇక్బాల్‌ (20) గురువారం మధ్యాహ్నం తన స్నేహితురాలితో కలిసి కారులో జూబ్లీహిల్స్‌ నుంచి మాదాపూర్‌కు వస్తుండగా కేబుల్‌ వంతెనపై కారు అదుపు తప్పి డివైడర్‌ను ఢీ కొట్టింది. ఈ మేరకు సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకొని బోల్తాపడ్డ కారును పక్కకు తొలగించారు. ఈ ప్రమాదంపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

About The Author

Related posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *