తెలుగు తేజం, జగ్గయ్య పేట : నవంబర్ 26 న జాతీయ కార్మిక సంఘాలు సమ్మెకు పిలుపునిచ్చారు, ఇది కేవలం రాజకీయ పార్టీల ప్రేరేపిత సమ్మె గా భావిస్తూ భారతీయ మజ్దూర్ సంఘ్ జగ్గయ్యపేట వి యస్ పి శాఖ తీవ్రంగా వ్యతిరేకిస్తూ,సమ్మె లో పాల్గొన్నటం లేదని జగ్గయ్యపేట మైన్స్ యూనిట్ అధ్యక్ష కార్యదర్శులు, PSN రాజు , రామచంద్ర నాయక్ తెలిపారు. దేశవ్యాప్త సమ్మె కోసం కొన్ని జాతీయ కార్మిక సంఘాలు ఇచ్చిన పిలుపు కేవలం రాజకీయ కారణాలతో జరుగుతున్న సమ్మె మాత్రమేనని స్టీల్ ప్లాంట్ సమస్యలపై పై రిమ్స్ వేతన ఒప్పందం ప్రైవేటీకరణ వ్యతిరేకంగా 14 రోజులపాటు నిరసన కార్యక్రమం చేయడం జరిగిందని అలాగే వారం రోజుల పాటు అన్ని జిల్లా కేంద్రాలలో ధర్నా నిర్వహించి లేబర్ కోడ్ మార్పులపై ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ప్రధానమంత్రి గారికి వినతి పత్రాలు పంపించడం జరిగిందని స్థానిక వైజాగ్ అనకాపల్లి ఎంపీలను కలిసి ప్లాంట్ సమస్య లు ప్రభుత్వ దృష్టికి తీసుకువెళ్లి పరిష్కారం చేయాలని విన్నవించడం జరిగింది అని పోస్కో కు విశాఖ ఉక్కు భూములను కేటాయించడాన్ని భారతీయ మజ్దూర్ సంఘ్ తీవ్రంగా గా వ్యతిరేకిస్తూ విశాఖ ఉక్కు సొంత గనుల పై ఎండిఓ విధానాన్ని రిమ్స్ భారతీయ మజ్దూర్ సంఘ్ వ్యతిరేకిస్తున్నట్లు అధ్యక్షులు కొమ్మినేని శ్రీనివాస్ తెలియజేశారు.