విజయవాడ : చెడుపై మంచి సాధించిన విజయానికి గుర్తుగా జరుపుకునే దీపావళి పర్వదినం జిల్లా ప్రజల జీవితాలలో గణనీయమైన మార్పుకు సంకేతం కావాలని ఆకాంక్షిస్తూ జిల్లా కలెక్టర్ ఎస్. డిల్లీరావు ఆకాంక్షించారు ప్రజలకు దీపావళి శుభా కాంక్షలు అందజేశారు. జిల్లాలో అర్హులైన ప్రజలందరూ సంక్షేమ పథకాల ద్వారా లబ్ది పొంది, ప్రతి ఒక్కరి జీవితాలలో చీకటి తెరలు తొలగిపోవాలన్నారు. ఆశ్వీజ మాసం చతుర్దశి నాడు నరకాసురుని సంహరించగా, ఆ తర్వాత రోజు దీపాలు వెలిగించి సంబరాలు చేసుకోవడం ఆనవాయితి అన్నారు.దీపావళి అంటే దీపాల వరుస అని అర్థం. కొన్ని ప్రాంతాల్లో దీపావళిని ఐదు రోజుల పండుగగా జరుపుకుంటారు. ఆశ్యయుజ బహుళ త్రయోదశితో ప్రారంభమైన దీపావళి వేడుకలు.. కార్తీక శుద్ద విదియ ”భగినీహస్త భోజనం’’తో ముగుస్తాయన్నారు. ఇంట్లోని ప్రతికూల శక్తులను తొలగించి.. నూతన వెలుగులు తీసుకొచ్చే గొప్ప పండుగగా దీపావళిని అభివర్ణించారు. హిందువులతో పాటు జైనులు, బౌద్ధులు, సిక్కులు, ముస్లిం ఇతర మతస్తులు ఆరోగ్యం, సంతోషాన్ని కోరుకుంటూ జరుపుకునే పర్వదినమే దీపావళి అని అన్నారు. జిల్లాలో అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు తో ప్రతి ఒక్కరికి పురోగతి కి జిల్లా యంత్రాంగం కృషి చేస్తోందన్నారు. జిల్లా ప్రజలందరూ దీపావళి పర్వదినాన్ని కుటుంబ సభ్యుల నడుమ అందమయం గా జరుపు కోవాలని జిల్లా కలెక్టర్ డిల్లీ రావు ఆకాంక్ష ను వ్యక్తం చేశారు.