న్యూఢిల్లీ : దేశంలో విద్యార్థుల ఆత్మహత్యలు పెరుగుతున్నాయి. ఎన్సీఆర్బీ లెక్కల ప్రకారం దశాబ్ద కాలంలో విద్యార్థుల ఆత్మహత్యలు 70 శాతం పెరిగాయి. ఐఐటీల్లో దళిత విద్యార్థులు, రాజస్థాన్‌లోని కోటాలో ఐఐటీ-జేఈఈ కోచింగ్ తీసుకుంటున్న విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకోవటం కలిచివేసే ఘటనలు. ఈ ఏడాది కోటాలో 23 మంది ఆత్మహత్యకు పాల్పడటం దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. సెప్టెంబర్ 10న ‘ప్రపంచ ఆత్మహత్యల నిరోధక దినం’ సందర్భంగా ఎన్సీఆర్బీ గణాంకాలను ఉటంకిస్తూ మీడియాలో కథనాలు వెలువడ్డాయి. 2011లో చోటుచేసుకున్న మొత్తం ఆత్మహత్యల్లో.. 2.3% విద్యార్థుల ఆత్మహత్యలు కాగా.. 2021నాటికి ఇది 8శాతానికి పెరిగింది.
కారణాలేంటి?
18 ఏండ్ల లోపు బాధితులు కుటుంబ సమస్యలతో ఆత్మహత్యకు పాల్పడినట్టు ఎన్సీఆర్బీ-2021 నివేదిక పేర్కొన్నది. తర్వాతి స్థానాల్లో లవ్ అఫైర్లు (1495), అనారోగ్యం (1408), పరీక్షల్లో ఫెయిల్ (864) ముఖ్య కారణాలుగా నిలిచాయి. కేవలం కౌన్సెలింగ్‌తో విద్యార్థుల ఆత్మహత్యల్ని అడ్డుకోలేమని, విద్యార్థుల ఇష్టాయిష్టాల్ని ప్రోత్సహించాలని ఢిల్లీ వర్సిటీ సైకాలజీ ప్రొఫెసర్ ఇట్షా నాగర్ అభిప్రాయపడ్డారు.
సంవత్సరం విద్యార్థుల ఆత్మహత్యలు
2011 7,696
2013 8,423
2015 8,934
2017 9,905
2019 10,335
2021 13,089