తెలుగు తేజం , జగ్గయ్యపేట :నష్టపోయిన పశుపోషణ దారులకు ప్రభుత్వం నష్టపరిహారం వెంటనే చెల్లించాలని జాతీయ బిసి సంక్షేమ సంఘం కృష్ణా జిల్లామహిళా అధ్యక్షురాలు, జగ్గయ్యపేట తెలుగు మహిళ అధ్యక్షురాలు కన్నెబోయిన రామలక్ష్మీ ప్రసాద్ అన్నారు. ఈ ఆమె సోమవారం
మాట్లాడుతూ భారివర్షాలు ,నీవర్ తుఫాన్ వల్ల తీవ్రమై న చలితో మృత్యువాత పడిన గొర్రెలు ,మేకలకు రాష్ట ప్రభుత్వం నష్ట పరిహారం చెల్లిచాలని కృష్ణా జిల్లాలో పలు మండలా లలో మృత్యువాత పడినటు వంటి వేలాది గొర్రెలు ,మేకలకు భీమా పరిహారాని తక్షణమె అందించేలా రాష్ట ప్రభుత్వం తగు చర్యలు తీసుకోవాలని, జిల్లాలోని ప్రతి గొర్రెలు ,మేకల పెంపకం దారుల సహకార సంఘానికి రూ 50.000/ లు ఆర్ధిక చెయుత రాష్ట్ర ప్రభుత్వం అందిచాలని , మరియు జిల్లా వ్యాప్తం ౪౦ శాతం మంది యాదవులు జీవనాధారం అయిన గొర్రెలు ,మేకల పెంపకం దారులకు పది లక్షల
గొర్రెలు యనిట్ లను మంజూరు చేయాలని , 45 సం..వయసు నిండిన గొర్రెలు , మేకల పెంపకం వృత్తి దారులకు పెన్షన్ మంజూరు చెయాలని ఈ విషయం పై రాష్ట్ర ప్రభుత్వం విదాన పరమైన నిర్ణయం తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నామన్నారు.