తెలుగు తేజం, నందిగామ : ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన నాటి నుంచి సంక్షేమ పథకాలు అందిస్తూ అన్ని వర్గాలకు చేరువవుతున్నారని ఎమ్మెల్యే డా”మొండితోక జగన్ మోహన్ రావు పేర్కొన్నారు. నందిగామ మండలంలోని అంబారుపేట గ్రామంలో నూతనంగా నిర్మించిన గ్రామ సచివాలయ భవనాన్ని ఆయన శుక్రవారం అధికారులతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా డా”జగన్ మోహన్ రావు మాట్లాడుతూ ప్రజలకు జవాబుదారీ పాలన అందించే దిశగా ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి పని చేస్తున్నారన్నారు. ఆయా పనుల నిమిత్తం ప్రజలు మండల కేంద్రాల్లోని ప్రభుత్వ కార్యాలయాలకు వెళ్లకుండా గ్రామ సచివాలయాల్లోనే పరిష్కరించుకునే దిశగా ముఖ్యమంత్రి చర్యలు తీసుకుంటున్నారన్నారు.
సచివాలయాలతో ఇళ్ల వద్దకే పాలన :
ప్రభుత్వ పథకాల కోసం ,పనుల నిమిత్తం కార్యాలయాల చుట్టూ తిరిగే పని లేకుండా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి రూపొందించిన గ్రామ వాలంటీర్లు, సచివాలయాల ద్వారా ప్రజల ఇళ్ల వద్దకే ప్రభుత్వ పాలన చేరుతుందన్నారు.