తెలుగు తేజం, నందిగామ : కృష్ణా జిల్లా ఎస్పీ రవీంద్రనాథ్ బాబు ఐపీఎస్ ఆదేశాల మేరకు నందిగామ డి.ఎస్.పి నాగేశ్వర్ రెడ్డి సారథ్యంలో నందిగామ రూరల్ సిఐ సతీష్ వీరులపాడు మండలం జమ్మవరం, వెల్లంకి, వి అన్నవరం, జయంతి, గూడెం మాధవరం, పెద్దాపురం, జుజ్జూరు గ్రామాలలో పరిమితికి మించి వ్యవసాయ కూలీలను ఆటోలో రవాణా చేస్తున్న ఆటోడ్రైవర్లకు మంగళవారం ఉదయం అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రోడ్డు ప్రమాదాలు నివారణలో భాగంగా నందిగామ రూరల్ పరిధిలోని కంచికచర్ల, వీరులపాడు, చందర్లపాడు మండల లోని ఆటో డ్రైవర్లకు అవగాహన కలిపించారు. ఆటో వెనక సీట్లో మాత్రమే ప్రయాణికులను ఎక్కించాలని, డ్రైవర్ సీటులో ఇరుపక్కల ప్రయాణికులను ఎక్కించరాదని, ఆటో వెనుక భాగాంలో ఉన్న డోర్ మీద ప్రయాణం చాలా ప్రమాదకరమని అలాగే డ్రైవర్లు విధిగా యూనిఫామ్, లైసెన్స్ కలిగి ఉండాలని, ఆటో కి సంబంధించిన పత్రాలు తప్పనిసరిగా ఉండాలని 18 సంవత్సరాల లోపు పిల్లలు వాహనాలు నడప రాదని టేప్ రికార్డులు సౌండ్ బాక్సులు పెట్టరాదని రైతులకు, వ్యవసాయ కూలీలకు కూడా పరిమితికి మించి ప్రయాణం ప్రమాదకరమని డ్రైవర్లకు అర్ధమయ్యే విందంగా తెలియజేశారు.విధంగా అవగాహన వారం రోజుల పాటు నిర్వహిస్తామని, వారం రోజుల తరువాత పరిమితికి మించి ప్రయాణికులను ఎక్కించుకొని నడుపుతున్న ఆటోను సీజ్ చేయడం జరుగుతుందని హెచ్చరించారు.