- అండగా ప్రభుత్వ అధికారులు
ఎన్టీఆర్ జిల్లా ఏ కొండూరు మండలం రేపూడి పంచాయతీ పరిధిలో గల జానలగడ్డ లో ప్రభుత్వ భూమిని కొలికపోగు. మరియమ్మw/o జమలయ్య, కొలికపోగు.రాము, కుమార్ బాబుs/o వెంకటేశ్వరరావు,కొలికపోగు. కృష్ణ అనే వ్యక్తులు ప్రభుత్వ భూమిని కబ్జా చేస్తూ దర్జాగాఅనుభవిస్తున్నారు. ఈ స్థలము ప్రభుత్వానికి సంబంధించింది. ఈ ప్రదేశంలో అంగన్వాడి, లేదా ప్రభుత్వానికి సంబంధించినకార్యాలయాలకునిర్ణయించింది దీనిని మనమే కబ్జా చేస్తే ఎలా అని స్థానికులు ప్రశ్నించడంతో తిరగబడుతున్న కబ్జా రాయుళ్లు. ఈ కబ్జాకు పాల్పడుతున్న వ్యక్తులు వెనుక ఏ కొండూరు కి చెందిన వీఆర్వో ఎస్.కె నాగుల్ మేర హస్తం ఉందనిస్థానికులు ఆరోపిస్తున్నారు. . ప్రభుత్వ భూమిని కాపాడాల్సిన వ్యక్తులే కబ్జా చేస్తున్న వ్యక్తులకు, ప్రభుత్వ స్థలం కబ్జా కి గురవుతుందని ఎన్నిసార్లు తెలిపినా కూడా పట్టించుకోకపోవడం వెనక వీఆర్వో హస్తము ఉందని స్థానికులు మండిపడుతున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వ అధికారులు స్పందించి ప్రభుత్వ స్థలాన్ని కబ్జారాయుల నుండి కాపాడాలని స్థానికులు కోరుతున్నారు. ప్రభుత్వ స్థలం కబ్జా గురవుతుందని అడిగినందుకు గద్దల నాగరాజు అనే వ్యక్తిపై కబ్జారాయుళ్లు తెగబడ్డారు. ప్రభుత్వ స్థలం కబ్జాకు గురికాకూడదని ప్రశ్నించిన స్థానికులపై పైనున్న వ్యక్తులు దాడికి పాల్పడినట్లు సమాచారం. ఈ విషయంపై స్థానిక ఏ కొండూరు పోలీస్ స్టేషన్ లో బాధితులు ఫిర్యాదు చేశారు ఈ విషయంపై స్థానిక ఎమ్మార్వో ని వివరణ కోరగా ఈ విషయం, దృష్టికి రాలేదని, ప్రభుత్వ భూమిని ఆక్రమిస్తేచర్యలు తీసుకుంటామని, వీఆర్వో పై కూడా చర్యలు తప్పవని, ఎందుకు స్పందించలేదు, ఏమిటి అనే విషయంపై స్వయంగా వెళ్లి తెలుసుకుంటామనిఎమ్మార్వో తెలిపారు. ఇప్పుడే ఆర్ ఐ పంపించి తగు సమాచారం తెలుసుకుంటామని, ఆక్రమించిన చర్యలు తీసుకుంటామని ఏ కొండూరు ఎమ్మార్వో తెలిపారు.