Breaking News

బీసీ సంక్రాంతి సభ వాహనాలు దారి మళ్లింపు

తెలుగు తేజం, విజయవాడ: ఇందిరా గాంధీ మున్సిపల్‌ స్టేడియంలో గురువారం జరుగనున్న బీసీ సంక్రాంతి సభలో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పాల్గొననున్నారు. బీసీ కార్పొరేషన్ల చైర్మన్లు, డైరెక్టర్ల ప్రమాణ స్వీకారానికి ఆయన హాజరుకానున్నారు. ఈ నేపథ్యంలో నగరంలో ట్రాఫిక్‌ ఆంక్షలు విధించినట్లు సీపీ బత్తిన శ్రీనివాసులు తెలిపారు.

పీఎన్‌బీఎస్‌ నుంచి మచిలీపట్నం, ఏలూరు వెళ్లే ఆర్టీసీ బస్సులు పీసీఆర్, చుట్టుగుంట, రామవరప్పాడు రింగ్ మీదుగా దారి మళ్లింపు. బందర్ రోడ్ లో ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు సిటీ బస్సులకు నిషేధం. పీసీఆర్‌ వైపు నుంచి బెంజి సర్కిల్ వెళ్ళు సాధారణ వాహనాలు డీసీపీ బంగ్లా మీదుగా స్టేట్ గెస్ట్ హౌస్, జమ్మిచెట్టు నుంచి పీవీపీ మాల్ మీదుగా ఎంజీ రోడ్‌లోకి మళ్లింపు. ఆర్టీఏ నుంచి రెడ్ సర్కిల్, రెడ్ సర్కిల్ నుంచి శిఖామణి సెంటర్, శిఖామణి సెంటర్ నుంచి వాటర్ ట్యాంక్ రోడ్‌లో వాహనాలు అనుమతించబడవు.

ఆహ్వానితులకు ప్రత్యేక సూచనలు:
బీసీ సంక్రాంతి కార్య‌క్ర‌మానికి వ‌చ్చే వీఐపీ వాహనాలకు గేట్ నెంబర్-2 ద్వారా ప్రవేశం
బీసీ కార్పొరేషన్ డైరెక్టర్లు వారి అనుచరులకు గేట్ నెంబర్-3 నుంచి ప్రవేశం
డైరెక్టర్ల వాహనాలకు స్వరాజ్య మైదానం ,పోలీస్ ఆర్మడ్ గ్రౌండ్ లో పార్కింగ్ ఏర్పాటు
కార్యకర్తలు,అతిధులు స్టేడియం పరిసర ప్రాంతాలలో ఎక్కడ పడితే అక్కడ వాహనాల పార్కింగ్ చేయరాదు
ఇతరులకు అసౌకర్యము కలిగించకుండా కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని సీపీ బత్తిన శ్రీనివాసులు విజ్ఞప్తి చేశారు.

About The Author

Related posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *