తెలుగు తేజం , విజయవాడ : కరోనా వ్యాప్తిలో ఉన్నందున కార్తీకమాసం దృష్ట్యా భక్తులందరూ జాగ్రత్తలు పాటించాలని జిల్లా కలెక్టర్ ఎండి ఇంతియాజ్ విజ్ఞప్తి చేశారు. సోమవారం నుండి కార్తీక మాసం ప్రారంభం కావడంతో భక్తులకు సూచనలు జారీ చేస్తూ ఆదివారం విజయవాడ లో ఒక ప్రకటన విడుదల చేశారు. కార్తీకమాసంలో ఆలయాల వద్ద ఎక్కువ రద్దీ ఉండకుండా చూడాలని కోరారు. అధిక రద్దీ ఉండే ప్రదేశాల వద్ద కరోనా వ్యాప్తికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయని సూచించారు. సాధ్యమైనంత వరకూ పూజలు ఇంటివద్దే నిర్వహించుకోవాలని ఆయన కోరారు. కుటుంబం ఆరోగ్యంగా ఆనందంగా సుఖశాంతులతో జీవించాలని చేసుకునే పూజలు కుటుంబం కరోనా బారిన పడే అవకాశం ఉండకుండా ప్రతి ఒక్కరూ ఆలోచించాలన్నారు. చలికాలం లో వైరస్ వ్యాప్తి ఎక్కువయ్యే ప్రమాదం ఉండడంవల్ల ప్రసార మాధ్యమాల ద్వారా వస్తున్న సూచనలు అందరూ అవగాహన చేసుకుంటారని, వీటిని దృష్టిలో పెట్టుకుని సురక్షితంగా ఉండి కార్తీక మాస పూజలు నిర్వహించుకోవాలని, బయటికి వచ్చేటప్పుడు ఇది మాస్కు పెట్టుకోవడం మర్చిపోవద్దని భౌతిక దూరం పాటించాలని కలెక్టర్ విజ్ఞప్తి చేశారు. దీపాలు వెలిగించే ముందు చేతులకు శానిటైజర్ రాసుకో వద్దని ఆయన తెలిపారు సురక్షిత్ చర్యలు చేపట్టి కుటుంబ యావత్తు ఆరోగ్యంగా ఉండాలని కలెక్టర్ ఇంతియాజ్ కోరారు.