యాదాద్రి-భువనగిరి: ప్రముఖ దివ్య క్షేత్రం యాదాద్రి దేవాలయంలో కార్తీక పౌర్ణమి వేడుకలు కన్నుల పండువగా జరుగుతున్నాయి. కార్తీక పౌర్ణమి సందర్భంగా ఆలయంలో భక్తులు సత్యనారాయణ స్వామి వ్రతాలు చేస్తున్నారు. తెల్లవారుజాము నుంచే భక్తులు స్వామి వారి దర్శనానికి తరలివస్తున్నారు. కోవిడ్ నిబంధనలు పాటిస్తూ భక్తులు యాదగిరీశుడిని దర్శించుకుంటున్నారు.