తెలుగు తేజం , నందిగామ : కృష్ణా జిల్లా ఎస్పీ రవీంద్రనాథ్ బాబు ఐపీఎస్ ఆదేశాల మేరకు నందిగామ డిఎస్పీ నాగేశ్వర్రెడ్డి సారథ్యంలో నందిగామ రూరల్ సీఐ సతీష్ ఆధ్వర్యంలో నందిగామ రూరల్ పరిధిలోని కంచికచర్ల, వీరులపాడు, చందర్లపాడు మండలాల ఎస్ఐలతో కలిసి విస్తృత దాడులు నిర్వహించారు. వీరులపాడు మండలం జయంతి, నరసింహారావు పాలెం గ్రామాల్లో రూరల్ సీఐ సతీష్ వీరులపాడు ఎస్ ఐ హరి ప్రసాద్ వారి సిబ్బందితో కలిసి దాడులు నిర్వహించి, జయంతి గ్రామంలో 6 క్వింటాలు, నరసింహారావు పాలెం గ్రామంలో 28 క్వింటాళ్ల రేషన్ బియ్యాన్ని స్వాధీనం చేసుకొని ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకోవడం జరిగింది. అలాగే కంచికచర్ల పట్టణంలో రూరల్ సిఐ సతీష్ మరియు కంచికచర్ల ఎస్సై రంగనాథ్ వారి సిబ్బందితో కలిసి ఓ సి క్లబ్ ప్రాంతంలో ఒక షాపు లో నిల్వ ఉంచిన వంద క్వింటాళ్ల బియ్యాన్ని ఆరుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకోవడం జరిగింది. చందర్లపాడు మండలం ముప్పాళ్ళ గ్రామంలో రూరల్ సీఐ సతీష్ ఎస్సై మణికుమార్ వారి సిబ్బందితో కలిసి దాడులు నిర్వహించి, కోళ్ల ఫారం లో నిల్వ ఉంచిన 12 క్వింటాళ్ల రేషన్ బియ్యాన్ని స్వాధీనం చేసుకొని ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకోవడం జరిగింది. ఈ సందర్భంగా రూరల్ సీఐ సతీష్ మాట్లాడుతూ తన రూరల్ పరిధిలో పేదల కడుపు నింపే పిడిఎఫ్ బియ్యాన్ని నిల్వ ఉంచిన రవాణా చేసిన సహించేది లేదని ప్రభుత్వం పేదలకు ఇచ్చే రేషన్ బియ్యం నీ కొందరు దళారులు అక్రమార్జనకు అలవాటుపడి రవాణా చేస్తున్నారని అలాగే కోళ్ల ఫారం లో కోళ్ళకు మేతగా ఈ రేషన్ బియ్యాన్ని ఉపయోగిస్తున్నారని తద్వారా కోళ్ల ఫారం నిర్వాహకులు రేషన్ బియ్యం నిల్వలు ఉంచడం జరిగిందని వారిని అదుపులోకి తీసుకోవడం జరిగిందని ఇదే కేసుపై రెండుసార్లు పట్టుబడితే రౌడీ షీట్ ఓపెన్ చేస్తామని ఐదుసార్లు పట్టుబడితే రౌడీ పి.డి యాక్ట్ ఓపెన్ చేస్తామని హెచ్చరించారు.