తెలుగు తేజం, ఇబ్రహీంపట్నం : ఇబ్రహీంపట్నం మండలంలో చిలుకూరు, దాములూరు,
కోటికలపూడి గ్రామాల్లో రైతులతో కలిసి వివిధ కూడళ్లలో అఖిల భారత కిసాన్ సభ పిలుపు మేరకు గ్రామాల్లో కిసాన్ జ్యోతి( కొవ్వొత్తుల) ర్యాలీ – ప్రదర్శన నిర్వహించారు. ఈ సంధర్భంగా రైతు సంఘం జిల్లా కార్యదర్శి పి.వి అంజనేయులు మాట్లాడుతూ
కేంద్ర బిజెపి ప్రభుత్వం తీసుకొచ్చిన 3 వ్యవసాయ రైతు వ్యతిరేక చట్టాలను రద్దు చేయాలని కోరుతూ డిల్లీలో వివిధ రాష్ట్రాల రైతులు 22 రోజుల గా చలిని సైతం లెక్క చేయకుండా మొక్కవోని దీక్ష తో పోరాటం చేస్తున్న రైతులతో కేంద్ర ప్రభుత్వం చర్చల పేరు తో వాయిదా వేస్తు రైతుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతుల ఆగ్రహ జ్వాల కేంద్ర ప్రభుత్వం పట్టించుకోకపోతే భవిష్యత్ లో రైతులు ప్రతాపం చవిచూడాల్సి వస్తొందని ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతులకు , ప్రజలకు ఇబ్బంది కలిగించే చట్టాలను రద్దు చేయాలని డిమాండ్ చేశారు … మరో పక్క బిజెపి తన మాఫియా మయజాలంతో రైతుల ఉద్యమాన్ని విచ్చినకర , విద్రోహ శక్తులతో ఉద్యమాన్ని విచ్చిన్నం చేయాలని చూడటం దిగజారుడు రాజకీయాలకు నిదర్శనమని దుయ్యబట్టారు.రైతుల న్యాయమైన , ప్రజాస్వామ్య యుతమైన డిమాండ్స్ ను తక్షణమే కేంద్ర ప్రభుత్వం పరిష్కారించాలని కోరారు.
ఈ కార్యక్రమంలో సిపిఎం మండల కార్యదర్శి ఎ.విఠల్ రావు , సిఐటియు మండల కార్యదర్శి యం.మహేష్ , బిల్డింగ్ యూనియన్ మండల కార్యదర్శి కె.కుమార్,
చిలువూరు గ్రామ రైతు సంఘం నాయకులు గరిమెళ్ళ పూర్ణచంద్రరావు , పాపారావు,దాములూరు గ్రామ రైతులు బాస్కరరావు , సాంబశివరావు ,కోటికలపూడి గ్రామ నాయకులు యలమందరావు , నరసింహ రావు , బాల కోటేశ్వరరావు