తెలుగు తేజం, కృష్ణా జిల్లాల్లో 27,872 ఇళ్లను నిర్మిస్తున్నామని అవి వివిధ దశల్లో పనులు జరుగుతున్నట్లు జిల్లా కలెక్టర్ అండ్ ఇండియా తెలిపారు. ఆదివారం టిడ్కో ఇళ్ల నిర్మాణాలపై జాయింట్ కలెక్టర్, ఆర్ డి వో లు, మున్సిపల్ కమిషనర్లు మరియు టిడ్కో అధికారులతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ ఇంతియాజ్ మాట్లాడుతూ టిడ్కో ఆధ్వరంలో పురపాల సంఘాల పరిధిలో నిర్మిస్తున్న ఇల్లు కాలనీల మౌలిక సదుపాయా లు పూర్తిచేసిన వెంటనే లబ్ధిదారులకు కేటాయింపులు జరుపుతామన్నారు. ఈ విషయంలో లబ్ధిదారులు ఎటువంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని అర్హత కలిగిన లబ్ధిదారులు వివరాలు వార్డు సచివాలయం వద్ద అందుబాటులో ఉంచడం జరుగుతుందన్నారు. మౌలిఖ విస్తరణలో భాగంగా విద్యుత్, తాగునీటి సరఫరా, మురుగు నీటి పారుదల వ్యవస్థ, అంతర్గత రహదారులు నిర్మాణాలను ప్రణాళికబద్ధంగా చేస్తున్నట్లు వివరించారు. ఇళ్ల విషయంలో ఎవరైనా రెచ్చగొట్టే ధోరణి లో వ్యవహరిస్తే దీనికి లబ్ధిదారులు లోనుకావద్దని అన్నారు. వాటిని చట్టవిరుద్ధమైన చర్యలుగా పరిగణిస్తాం అన్నారు. నగర, పట్టణాల్లో ఇళ్ల నిర్మాణాలు విఎంసి జక్కంపూడి కాలనీ 6576, జగ్గయ్యపేట 3168, నందిగామ 240, ఉయ్యూరు 2496, తిరువూరు 1536, నూజివీడు 2640, గుడివాడ 8912, మచిలీపట్నం 2034 ఇళ్లు నిర్మిస్తున్నట్లు తెలిపారు.