భారతదేశ స్థాయిలో సీబీఎస్ఈ బోర్డు ద్వారా నిర్వహించే ప్రతిష్ఠాత్మకమైన పోటీ పరీక్ష అయిన ఎన్ టి ఎస్ సి ( నేషనల్ టాలెంట్ సెర్చ్ ఎగ్జామ్) అనగా”జాతీయ స్థాయి ప్రతిభ అన్వేషణ పరీక్ష” లో మన హనుమాన్ జంక్షన్ కు చెందిన చైతన్య భారతి స్కూల్ (డానియల్)విద్యార్థి లింగంపల్లి లికిత్ జాతీయస్థాయిలో ఉత్తమ ఫలితం సాధించాడు అని ఆ స్కూలు ప్రధానోపాధ్యాయులు ఎల్ మురళి తెలిపారు. ఈ పోటీ పరీక్ష మొదటి స్థాయిలో 18 వరకు సంపాదించి హనుమాన్ జంక్షన్ పుర ప్రముఖులు అభినందనలు చూరగొన్నాడు. నేడు ప్రకటించిన నా రెండో స్థాయి పరీక్షలో కూడా జాతీయస్థాయిలో పదో ర్యాంకుకు సాధించి విజయ దుందుభి మోగించాడు. సాధారణంగా ఈ పరీక్ష దేశంలో అతి కఠినమైన పరీక్షలలో ఒకటి. దీనిని పదో తరగతి స్థాయిలో మినీ ఐఏఎస్ పరీక్షగా అభి వర్ణించవచ్చు. దేశంలో మొదటి స్థాయిలో దాదాపు అన్ని రాష్ట్రాల నుండి 15 లక్షల మంది విద్యార్థులు ఈ పరీక్షకు పోటీపడతారు . మొదటి స్థాయిలో 8 వేల మంది విద్యార్థులను మాత్రమే ఎంపిక చేస్తారు. రెండవ స్థాయి పరీక్షల్లో కేవలం 2000 మంది విద్యార్థులను మాత్రమే ఎంపిక చేస్తారు. మన దేశంలోనే ప్రతిష్ఠాత్మకమైన సీబీఎస్ఈ బోర్డు (ఎన్సీఈఆర్టీ) వారు ప్రకటించిన మెరిట్ జాబితాలో పదో ర్యాంకును సంపాదించి హనుమాన్ జంక్షన్ మరియు చైతన్యభారతి (డానియల్) స్కూల్ యొక్క అధ్యాపకుల సంకల్పం మరియు అకుంఠిత దీక్ష మరియు విద్యార్థి యొక్క శ్రమను భారతదేశ స్థాయిలో లో కీర్తి ప్రతిష్టలు వచ్చేలా ఫలితం ఉందని పలువురు ప్రముఖులు ఉపాధ్యాయులను మరియు లిఖిత్నను అభినందించారు.