తెలుగు తేజం, ఇబ్రహీంపట్నం ఇసుక రేవు ప్రాంత ప్రజలతో సమావేశమై వారి ఇళ్ల పట్టాల సమస్యకు పరిష్కారం కోసం కృషి చేసిన మైలవరం శాసనసభ్యులు వసంత కృష్ణ ప్రసాదు.ఇబ్రహీంపట్నం లోని ఇసుక రేవు ప్రాంతం లో నివసిస్తున్న పల్లెకారుల కుటుంబాలకు ప్రభుత్వం ద్వార ఇళ్ల పట్టాలు మంజూరు కాగా,
తామంతా కృష్ణానదీ ని నమ్ముకుని నదిఒడ్డున చేపల వేట సాగిస్తూ జీవనం సాగిస్తున్న వారమని తమ ఇళ్ల పట్టాల విషయం లో ప్రతేకశ్రద్ద చూపాలని ఇసుక రేవు ప్రాంత వాసులు ఎమ్మెల్యే కృష్ణ ప్రసాదు ని కలిసి విజ్ణప్తి చేశారు.పల్లెకారుల విజ్ణప్తి మేరకు బుధవారం సాయంత్రం ఎమ్మెల్యే కృష్ణ ప్రసాదు స్థానిక నాయకులు అధికారులు సచివాలయ వార్డు వాలంటీర్లతో కలిసి ఇసుక రేవు వద్దకు వచ్చి సమావేశం నిర్వహించి వారి నుంచి అభిప్రాయాలు తెలుసుకున్నారు.అందరు కలిసి ఒక నిర్ణయం తీసుకోవాలని మీ అభిప్రాయం ప్రకారం ఇళ్ల పట్టాలు ఇవ్వడం జరుగుతుందని తెలిపారు.
వాలంటీర్ల ద్వార అభిప్రాయ సేకరణ నిర్వహించారు. త్వరలో మరోసారి సమావేశం నిర్వహించి మెజార్టీ ప్రజల అభిప్రాయం మేరకు తగు నిర్ణయం తీసుకోవడం జరుగుతుందని తెలిపారు.
ఈ కార్యక్రమం లో స్థానిక నాయకులు ,అధికారులు, సచివాలయ వార్డు వాలంటీర్లు, ఇసుక రేపు ప్రజలు పాల్గొన్నారు.