వత్సవాయి తెలుగుతేజం ప్రతినిది: కృష్ణాజిల్లా వత్సవాయి మండలం లోని మంగోల్లు హైస్కూల్ నందు 1977 నుండి 1987 వరకు మంగొల్లు ప్రాధమిక ఉన్నత పాఠశాల, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో చదివిన పూర్వ విద్యార్థుల సమ్మేళన కార్యక్రమం అక్టోబర్ 14వ తేదీ ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు నిర్వహించడం జరుగుతుంది నిర్వాహకులు తెలిపారు. ఈ సందర్భంగా మంగొల్లు గ్రామానికి హైస్కూల్ రావటానికి విశేష కృషి చేసిన నాటి ప్రదాన ఉపాధ్యాయుడు విఠల్ రావుని, హైస్కూల్ నిర్మాణానికి 3 ఎకరాలు దానమిచ్చి నిర్మాణాన్ని దగ్గర వుండి పూర్తి చేసిన కీర్తిశేషులు మన్నె శేషయ్య కి నివాళులు అర్పించి, వారి కుటుంబ సభ్యులను, ఆనాటి గురువులను, హైస్కూల్ అబివృద్ధి లో పాలుపంచుకున్న నాటి గ్రామ పెద్దలను గ్రామ ప్రజాప్రతినిధులను గౌరవిచంటం జరుగుతుంది. అనంతరం పాఠశాల ఆవరణలో పూర్వ విద్యార్థుల సమ్మేళనం గుర్తుగా మొక్కలు నాటే కార్యక్రమం చేపడతారని తెలిపారు. అలాగే వారి వినోదం కొరకు ఆటల పోటీలు నిర్వహించి బహుమతి ప్రధానాం చేయటం జరుగుతుందని తెలిపారు. గ్రామ అభివృద్ది కి చేయతగిన పనుల గూర్చి చర్చ జరుగుతోంది కావున పూర్వ విద్యార్థులు ఎక్కడ వున్నా ఈ కార్యక్రమంలో పాల్గొని జయప్రదం చేయాలని కోరుచున్నారు.ఈ సమ్మేళనం సన్నాహక సమావేశం గూర్చి పూర్వ విద్యార్థుల సమావేశం జయప్రదం చేయటానికి వివిధ భాద్యతలను పలువురికి కేటాయించటం జరిగింది. 1977 నుండి 1987 వరకు మంగొల్లు ప్రాధమిక ఉన్నత పాఠశాల, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో చదివిన పూర్వ విద్యార్థులందరు స్వచ్ఛందంగా ఈ కార్యక్రమంలో పాల్గొని జయప్రదం చేయాలని కోరుతున్నారు. ఈ కార్యక్రమములో మన్నె శ్రీనివాసరావు, షేక్ తాజ్ బాబు, మన్నె సత్యనారాయణ, షేక్ నబ్బి, బొల్లం పురుషోత్తం, మారేడుబాకుల మెహన్రావు, జెట్టి కోనయ్యపొందూరు లక్ష్మణరావు, మన్నె నారాయణ,మన్నె లింగయ్య, నెల్లూరి నారాయణ,తదితరులు పాల్గొన్నారు.