తెలుగు తేజం, మోపిదేవి :మండల కేంద్రం మోపిదేవి శివారు బో డ గుంట గ్రామంలో బోన్ మ్యారో వ్యాధితో బాధపడుతున్నఅనపర్తి బాలవర్ధన్ అనే విద్యార్థికి అవనిగడ్డ శ్రీరామ వెల్ఫేర్ సొసైటీ అధ్యక్షులు తోట శ్యామ్ కిషోర్ నాయుడు 5,000 రూపాయలు ఆర్థిక సహాయంగా ఆదివారం అందజేశారు. బోడగుంట చర్చి వద్ద జరిగిన ఈ కార్యక్రమంలో మోపిదేవి పిఎసిఎస్ అధ్యక్షులు కామిశెట్టి సురేష్ బాబు. చర్చి పాస్టర్ మొండితోక దేవ వరప్రసాద్. కేస గాని రాము. కొలుసు నాగార్జున . ఎన్ శివరామకృష్ణ. గ్రామ పెద్దలు పాల్గొన్నారు.