ఎన్నో చిత్రాల్లో అద్భుతంగా నటించి, ఆయా పాత్రలకు తన నటనతో ప్రాణ ప్రతిష్ట చేసిన ఎవర్గ్రీన్ యాక్టర్ బాలీవుడ్ సూపర్‌స్టార్ అమితాబ్ అలియాస్ బిగ్‌బి. ఈరోజు (అక్టోబర్ 11) పుట్టినరోజు సందర్భంగా అమితాబ్ కు సోషల్ మీడియాలో పుట్టినరోజు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. టాలీవుడ్ సూపర్‌స్టార్ మహేశ్, మెగాపవర్‌స్టార్ రామ్‌చరణ్ ట్విట్టర్ ద్వారా బిగ్ బీకి శుభాకాంక్షలను అందించారు. మాతో పాటు ఎన్నో లక్షల మందిలో స్ఫూర్తినింపిన మీరు ఇలాంటి పుట్టినరోజులను మరెన్నో జరుపుకోవాలని మహేశ్, చరణ్ అభిలషించారు. అమితాబ్‌తో కలిసి ఉన్న ఫొటోలను వారు షేర్ చేసుకున్నారు.