గన్నవరం (తెలుగు తేజం ప్రతినిధి): కృష్ణాజిల్లా గన్నవరం లోని బి కె ఆర్ వృద్ధాశ్రమం – అమ్మ చిల్డ్రన్ హోమ్ లలో గల అనాధ వృద్ధులు, బాలల సహాయార్థం “అల్లరి పిల్లలు” సంస్థ సభ్యులు శనివారం ఫర్నిచర్ అందజేశారు వీటిలో లో వాటర్ హీటర్ (25 L),స్టైయిన్ లెస్ స్టీల్ భోజనం టేబుల్స్ (8 ),హ్యాండిల్ కుర్చీలు (20), బియ్యం బస్తాలు( 2),వాటర్ ఫిల్టర్స్(2 ) అందించడం జరిగింది. ఈ సందర్భంగా ఆశ్రమ చైర్మన్ శ్రీమతి కానూరి శేషు మాధవి మాట్లాడుతూ, గత నాలుగు సంవత్సరాలుగా వృద్ధాశ్రమాన్ని ఎంతో సేవా దృక్పథంతో నిర్వహించడం వల్ల దాతలు సహాయాలు అందిస్తున్నారని కరోనా సంక్లిష్ట పరిస్థితులలో ఆశ్రమంలో ఉన్న వృద్ధులకు బాలలకు సహాయం చేయాలనే మానవతా దృక్పథంతో ఈరోజు ఫర్నిచర్ అందజేసిన అల్లరి పిల్లలు గ్రూప్ సంస్థ సభ్యులందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేశారు. అల్లరి పిల్లలు సంస్థ ప్రతినిధి శ్రీ కొల్లా అనిల్ కుమార్ మాట్లాడుతూ అనాధ వృద్ధులను, బాలల చేరదీసి వారికి సేవలు అందించడం సాధారణమైన విషయం కాదని గత నాలుగు సంవత్సరాలుగా ఎంతో అంకితభావంతో సేవలు అందిస్తున్న ఆశ్రమ నిర్వాహకురాలు శ్రీమతి కానూరి శేషు మాధవి ని అభినందించారు. వృద్ధుల సహాయార్థం ఏదైనా సహాయం చేద్దామనే ప్రతిపాదనను తెలియజేయగానే అల్లరి పిల్లలు గ్రూప్ లోని సభ్యులందరూ స్పందించి సహకరించారని తెలిపారు. ఈ కార్యక్రమంలో అల్లరి పిల్లలు గ్రూప్ సభ్యులు శ్రీమతి దుపాటి శ్రీదేవి, శ్రీ భయ్యా. ప్రసాద్, శ్రీ బద్రీనాథ్, వనమా గణేష్, బి కె ఆర్ సేవా సంఘం ప్రతినిధులు కె.శ్రీనివాసరావు, వి.వినయ్ కుమార్, బొకినాల. అశోక్ ఆశ్రమ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.