తెలుగు తేజం, పెనమలూరు : పెనమలూరు మండలంలోని నివేస స్థలం లేని పెద్దలందరికి ప్రభుత్వం ఈ నెల 25 వ తేదీన ఇళ్ల పట్టాల పంపిణి చేపట్ట నున్నట్లు పెనమలూరు మండల తహసీల్దార్ జి బద్రు తెలిపారు. తెలుగు తేజం ప్రత్యేక ఇంటర్వూలో మాట్లాడుతూ మండలంలో 11,297 మంది అర్హులను గుర్తించడం జరిగిందని తెలిపారు. వారికి వణుకూరు గ్రామంలో 279 ఎకరాల్లో భూమిని ఎకరం రూ 75 /- లక్షల చొప్పున సేకరించి ఇవ్వడం జరుగుతుందని తెలిపారు. పెనమలూరు గ్రామంలో మరో 9.70 ఎకరాల అసైన్డ్ ల్యాండ్ ను సమీకరించిన ఇవ్వడం జరుగుతుందని అన్నారు. ఈ నివేశస్థలాల్లో ప్రస్తుతం అభివృద్ధి పనులు కొనసాగుతున్నాయని ఈ నెల 25 నాటికి ఈ లేఔట్ సిద్ధమవుతుందని తహసీల్దార్ తెలిపారు. ఇంకా అర్హులు ఉండి ఉంటె ఇప్పటికైనా తమ దరఖాస్తులను సంబందించిన అధికారులకు అందచేయవచ్చని ఆయన తెలిపారు. ప్రభుత్వ ఆదేశాల ప్రకారం వారి అర్హతలు బట్టి ప్రతీ ఒక్కరికి ఇళ్ల స్థలం కేటాయించడం జరుగుతుందని తెలిపారు.