సెప్టెంబరు 30 వరకు గడువు కల్పించిన ఆర్బీఐ
దిల్లీ: రీఛార్జులు, ఓటీటీ, డీటీహెచ్, యుటిలిటీ బిల్లు సహా పలు సేవలకు సంబంధించి ఆటోమేటిక్ రికరింగ్ చెల్లింపులపై వినియోగదారులకు భారతీయ రిజర్వ్ బ్యాంక్(ఆర్బీఐ) ఊరట కల్పించింది. ఆటోమేటిక్ చెల్లింపులకు అదనపు ధ్రువీకరణ(ఏఎఫ్ఏ) తప్పనిసరి చేసే కొత్త మార్గదర్శకాల అమలును ఈ ఏడాది సెప్టెంబరు 30 వరకు వాయిదా వేసింది. ఈ మేరకు ఆర్బీఐ బుధవారం వెల్లడించింది.