తెలుగు తేజం, మచిలీపట్టణం : కృష్ణ, గుంటూరు జిల్లాల ఉపాధ్యాయ నియోజకవర్గ శాసన మండలి ఎన్నికలు 2021 ఫిబ్రవరి లేదా మార్చి నెలలో జరుగుతాయని, 2020 డిసెంబర్ 31 తేదీ లోగా అర్హత గల ఉపాధ్యాయులు ఓటరుగా నమోదు చేసుకోవాలని జిల్లా కలెక్టర్ ఏ ఎండి ఇంతియాజ్ ఒక ప్రకటనలో తెలిపారు. ది. 1-11-2020 తేదీకి ముందు గత ౬ సంవత్సరాల్లో కనీసం 3సంవత్సరాల సర్వీసు పూర్తి చేసిన టీచర్లు అధ్యాపకులు, ప్రోఫీసర్లు ఓటరుగా నమోదుకు అర్హులని తెలిపారు. అర్హులైన వారు డిసెంబర్ 31లోగా ఫారం-19 లో దరఖాస్తులను తమకు అసెంబ్లీ నియోజకవర్గ ఓటు ఉన్న మండల తాసిల్దార్ కు లేక ఎంపీడీవో మున్సిపల్ కార్యాలయంలో సమర్పించి ఓటరుగా నమోదు చేసుకోవచ్చని తెలిపారు. సీఈఓ ఆంధ్ర వెబ్సైట్ ద్వారా ఆన్లైన్లో కూడా సమర్పించవచ్చన్నారు. ది. 1-11-2020 నాటికి 3 సంవత్సరాలు నిరంతరాయ సర్వీసు పూర్తి చేసుకున్న ప్రభుత్వ జిల్లా పరిషత్, మున్సిపల్, సాంఘిక, సంక్షేమ, ట్రైబల్ వెల్ఫేర్, గురుకులం, మోడల్, కే .జి. బి. ఆఫ్ ఎయిడెడ్ మేనేజ్మెంట్ల క్రింద ఉన్న హై స్కూల్స్ జూనియర్ డిగ్రీ పాలిటెక్నిక్ యూనివర్సిటీ బీఈడీ కాలేజీ లో ఇంజనీరింగ్ కాలేజీ లో పనిచేస్తున్న బోధన సిబ్బంది అందరూ అందరు ఓటరుగా నమోదు అవటానికి అర్హులని తెలిపారు. గుంటూరు ఉపాధ్యాయ నియోజకవర్గం ఓటర్ల జాబితా తయారు చేయుటకు ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేసిందని ఈ ప్రకారం డిసెంబర్ 1న డ్రాఫ్టు పబ్లికేషన్ చేసినట్లు తెలిపారు. 1-12-2020 నుండి 31-12-2020 వరకు ఓటరు నమోదు క్లయిముల మరియు అభ్యంతరాలు స్వీకరిస్తారని 2021 జనవరి 12 నాటికి క్లయిముల అభ్యంతరాలు పరిష్కరించి 21 జనవరి 18 నాటికి తుది ఓటర్ జాబితా ప్రదర్శిస్తారని కలెక్టర్ పేర్కొన్నారు. ఈనెల 1న ప్రచురించిన డ్రాఫ్ట్ పబ్లికేషన్ ప్రకారం ఇప్పటిదాకా జిల్లాలో మొత్తం 4,178 మంది మంది వీరిలో పురుషులు 2380, మహిళలు 1798 ఓటర్లుగా నమోదు అయ్యారని తెలిపారు. అర్హత వారి సంఖ్య కంటే చాలా తక్కువ సంఖ్యలో నమోదు అయినందున అర్హత గల ఉపాధ్యాయులు అధ్యాపకులు ప్రొఫెసర్లు డిసెంబర్ 31 లోగా ఓటర్ నమోదు కావాలని కలెక్టర్ కోరారు