తెలుగు తేజం, జగ్గయ్యపేట : జగ్గయ్యపేట మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ ఎండి సిద్దిక్ ఆంధ్ర ప్రదేశ్ రవాణా శాఖ టెక్నికల్ అధికారుల సంఘం వైస్ ప్రెసిడెంట్ గా ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా ఆయన రాష్ట్ర ప్రభుత్వ విప్ శాసనసభ్యులు సామినేని ఉదయభాను ను మంగళవారం మర్యాద పూర్వకంగా కలిశారు. సిద్దిక్ ను సామినేని ఉదయభాను అభినందించారు. ఎండి సిద్దిక్ జగ్గయ్యపేట రవాణా శాఖ కార్యాలయానికి ప్రభుత్వం స్థలం కేటాయించాలని ఎమ్మెల్యేను కోరారు. అందుకు సానుకూలంగా స్పందించిన ఎమ్మెల్యే త్వరలో ఈ విషయంపై ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తానని హామీ ఇచ్చారు.