తెలుగు తేజం, నందిగామ టౌన్ : రైతుపేట టిడిపి పార్టీ కార్యాలయంలో మాజీ శాసన సభ్యురాలు శ్రీమతి తంగిరాల సౌమ్య తో కలిసి రాష్ట్ర పార్టీ ప్రధాన కార్యదర్శి, మాజీ మంత్రివర్యులు దేవినేని ఉమామహేశ్వరరావు గురువారం మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భగా ఆయన మాట్లాడుతూ ఎన్నికల కమిషనర్ కు సంబంధం లేకుండా ఎన్నికల కమిషన్ దృష్టిలో పెట్టకుండా రాష్ట్ర ప్రభుత్వం I&PR శాఖ బుధవారం ఏకగ్రీవాలు పట్ల 4 ఇంగ్లీష్ ఛానల్ లో కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ప్రకటనలు ఇవ్వడం మళ్లీ దానిని సమర్థించుకుంటూ మాట్లాడుతున్నారు. గతంలో ఎంపీటీసీ, జడ్పిటిసి ఎన్నికల్లో ఏ విధంగా ఏకగ్రీవం అయ్యాయి. పులివెందుల నియోజకవర్గం కడపలో, రాష్ట్రంలో భయపెట్టి, బలవంతంగా బెదిరించి ఏ విధంగా ఏకగ్రీవాలు చేసి స్థానిక ఎన్నికలను అపహాస్యం చేశారో చూసాము. హైకోర్టు ధర్మాసనం తీర్పు మేర ఎలక్షన్ ప్రక్రియ ప్రారంభమైన తరువాత కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఉద్యోగ సంఘాలు హైకోర్టు తీర్పు మీద సుప్రీంకోర్టుకు వెళ్లారు. చెంప పెట్టు లాంటి తీర్పు వచ్చినా కూడా ఈ ప్రభుత్వానికి జ్ఞానోదయం కాకుండా బాధ్యతాయుతమైన పదవుల్లో ఉన్న రాష్ట్ర మంత్రులు, ముఖ్యమంత్రి రాజ్యాంగ వ్యవస్థలైన ఎన్నికల కమిషన్ ను దూషిస్తూ మాట్లాడారు. ఎలక్షన్ కమిషన్ వ్యవస్థను లెక్కపెట్టకుండా వారు ఇచ్చిన ఆదేశాలను పట్టించుకోమంటున్నారు. రాజ్యాంగాన్ని పాటించకుండా, రాజ్యాంగ పరిధిని అతిక్రమిస్తూ ఉన్నారు. రాజ్యాంగం మీద ప్రమాణం చేసి ముఖ్యమంత్రిగా, మంత్రులుగా పదవులు చేపట్టిన ఈ వై ఎస్ ఆర్ సి పి నాయకులు బాధ్యత రాహిత్యంగా మాట్లాడుతూ రాజ్యాంగ ఉల్లంఘనకు పాల్పడుతున్నారు. డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ స్ఫూర్తితో లిఖించబడిన రాజ్యాంగాన్ని అవమానిస్తూ, లెక్కపెట్టకుండా రాజ్యాంగ ఉల్లంఘనకు పాల్పడ్డారు. ప్రజాప్రాతినిధ్య చట్టం ప్రకారం వీళ్ళందరి మీద చర్యలు తీసుకోవాలి. ఇవాళ రాష్ట్రంలో రాజ్యాంగాన్ని కాపాడవలసిన ప్రథమ పౌరుడు గవర్నర్ స్పందించాలి. గవర్నర్ చెప్పిన తర్వాత కూడా, ఆయన ఆదేశాలను ప్రభుత్వానికి పంపించిన తర్వాత కూడా ఎన్నికల నిబంధనలను గౌరవించకుండా సీఎం సమావేశాలు పెడుతున్నారు. స్వయంగా ముఖ్యమంత్రే గ్రామాల్లోకి వెళ్ళమని చెబుతున్నారు. రాజ్యాంగ పరిధిని దాటి వారు నియంత్రణ లేకుండా తెలుగు భాషలో ఎన్ని బూతులు ఉన్నాయో అన్ని మాటలను శాసనసభ్యులు, మంత్రులు , ముఖ్యమంత్రి మాట్లాడుతున్నారు. సుప్రీం కోర్టు తీర్పును కూడా లెక్కపెట్టలేనంత విధంగా అవమానపరిచే విధంగా వ్యవస్థలపై దాడి చేస్తున్నారు. రాజీనామా చేస్తామని చెప్పి రంకెలు వేశారు ముఖ్యమంత్రి కి ఎందుకు ధైర్యం లేదు మిమ్మల్ని ఎవరు ఆపారు.? సజ్జల రామకృష్ణా రెడ్డి మీడియా ముందుకు వచ్చేంతవరకు తాడేపల్లి రాజప్రసాదంలో ఏం జరిగింది.? సుప్రీంకోర్టు తీర్పు రాగానే ఉత్తర కుమార ప్రగల్భాలు పలికిన ముఖ్యమంత్రి ఎందుకు భయపడ్డాడు. ప్రజాభిప్రాయానికి వ్యతిరేకంగా ఉంది అని తెలిసి ముఖ్యమంత్రి తెల్ల జెండా ఊపారు. సజ్జల రామకృష్ణారెడ్డి మీడియా ముందుకు పంపించి ఎన్నికల్లో పాల్గొంటామని చెప్పించారు. మళ్లీ 24 గంటలు తిరక్కుండా ఎన్నికల కమిషన్ ను నిందిస్తూ, దూషిస్తూ, దుర్భాషలాడుతూ బాధ్యతారహితంగా మాట్లాడుతున్నారు. దేశంలో భారత రాజ్యాంగాన్ని కాపాడాల్సిన బాధ్యత దేశ ప్రథమ పౌరుడు కి ఉంది. భారత రాజ్యాంగ స్ఫూర్తిని కాపాడండి. లక్ష్మణ రేఖ దాటిన మంత్రులు కావచ్చు, ఎమ్మెల్యేలు కావచ్చు , ముఖ్యమంత్రి కావచ్చు అధికారులు కావచ్చు ఎవరు పరిధి దాటిన వేటు పడాల్సిందే.