నెల్లూరు : జిల్లాలోని మర్రిపాడు మండలం డీసీపల్లి టోల్ ప్లాజా వద్ద మంత్రుల కాన్వాయ్‌లోని కార్లు ఢీ కొన్నాయి. సోమవారం నాడు మంత్రులు మేకపాటి గౌతం రెడ్డి, అనిల్ కుమార్ యాదవ్ జిల్లాలో పర్యటించడానికి వెళ్తుండగా.. కాన్వాయ్‌లోని కార్లు ఒకదాన్నొకటి ఢీ కొన్నాయి. ముందు వెళ్తున్న కారు సడన్ బ్రేక్ వేయడంతో వెనుక నుంచి ఆరు కార్లు ఢీకొన్నాయి. ఈ ఆరు కార్లుకు ముందు భాగం ధ్వంసమయ్యాయి. ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి ప్రమాదమేమీ జరగలేదు. అనంతరం యథావిథిగా మంత్రులు కార్యక్రమానికి వెళ్లిపోయారు.
నెల్లూరు నుంచి మర్రిపాడు మండలం కృష్ణాపురంలో జరగనున్న హై లెవెల్ కెనాల్ ఫేజ్-2 శంకుస్థాపనకి వెళ్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది.