Breaking News

చిరంజీవికి కరోనా పాజిటివ్‌

మెగాస్టార్ చిరంజీవి కరోనా బారిన పడ్డారు. `ఆచార్య` సినిమా షూటింగ్‌లో పాల్గొనబోతున్న సందర్భంగా చేయించుకున్న కోవిడ్ టెస్ట్‌లో పాజిటివ్‌గా తేలింది. ఈ విషయాన్ని చిరంజీవి ట్విటర్ ద్వారా వెల్లడించారు. గత 4-5 రోజుల్లో తనను కలిసినవారందరూ టెస్ట్ చేయించుకోవాలని విజ్ఞప్తి చేశారు. 

“ఆచార్య` షూటింగ్ ప్రారంభించాలని కోవిడ్ టెస్ట్ చేయించుకున్నాను. రిజల్ట్ పాజిటివ్. నాకు ఎలాంటి కోవిడ్ లక్షణాలు లేవు. వెంటనే హోమ్ క్వారంటైన్ అయ్యాను. గత 4-5 రోజులుగా నన్ను కలిసినవారందరిని టెస్ట్ చేయించుకోవాలిసిందిగా కోరుతున్నాను. ఎప్పటికప్పుడు నా ఆరోగ్య పరిస్థితిని మీకు తెలియచేస్తాన`ని చిరంజీవి ట్వీట్ చేశారు. మెగాస్టార్ త్వరగా కోలుకోవాలని కోరుకుంటూ అభిమానులు ట్వీట్లు చేస్తున్నారు. 

About The Author

Related posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *