భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ భారత ప్రజాస్వామ్య రాజ్యాంగ రచనకు చేసిన సేవలకు గుర్తింపుగా భారతీయ కరెన్సీ నోట్లపై అంబేద్కర్ బొమ్మను ముద్రించాలని ఆంధ్రప్రదేశ్ దళిత బహుజన సమగ్రాభివృద్ధి వేదిక సమన్వయకర్త పోతుల బాలకోటయ్య కేంద్రం ప్రభుత్వాన్ని కోరారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ 75 ఏళ్ల స్వతంత్ర భారత దేశం లౌకికవాదం తో ,ప్రాథమిక హక్కులు, ఆదేశిక సూత్రాలతో భిన్న మతాలు, భిన్న నాగరికతలు, భిన్న సంస్కృతుల సమ్మేళనం తో జీవించేందుకు, ప్రపంచ దేశాలు గుర్తించే స్థాయికి చేరడంలో అంబేద్కర్ కృషి అపూర్వమైనదని చెప్పారు . రిజర్వు బ్యాంకు ఏర్పాటులోనూ అంబేద్కర్ పాత్ర ఎంతో ఉందని ఆయన తెలిపారు. ఆయన బొమ్మను కూడా కరెన్సీ నోట్లపై ముద్రించి గౌరవించుకోవాల ని , దేశ ప్రధాని మంత్రి నరేంద్ర మోడీ రిజర్వు బ్యాంకు కు తగిన ఆదేశాలను ఇవ్వాలని కోరారు. దేశంలోని పార్లమెంటు సభ్యులు ఈనెల 19వ తేదీ నుంచి జరిగే పార్లమెంట్ సమావేశాల్లో చర్చకు పెట్టాలని, ఆయా రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఈ విషయంపై అసెంబ్లీలలో తీర్మాణాలు చేయాలని డిమాండ్ చేశారు. ఎస్సీ ,ఎస్టీ ,బిసి ,మైనార్టీలకు చెందిన నాయకులు, ప్రజాస్వామిక మేధావులు అంబేద్కర్ బొమ్మ మంద్రించే వరకు ఉద్యమ స్వరం వినిపిస్తునే ఉండాలని బాలకోటయ్య పిలుపునిచ్చారు.