తెలుగు తేజం, కంచికచర్ల : కంచికచర్ల అగ్నిమాపక అధికారి వై నాగేశ్వరరావు ఆధ్వర్యంలో కంచికచర్ల పట్టణంలో పలు ప్రాంతాలలో అగ్నిమాపక సిబ్బంది ప్రజలకు అవగాహన కల్పించారు. అక్షర కాలేజ్ రవీంద్ర భారతి స్కూల్ లోని విద్యార్థులకు కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి విద్యార్థులకు వివరించారు. ఈ సందర్భంగా ఫైర్ ఆఫీసర్ నాగేశ్వరరావు మాట్లాడుతూ కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని భౌతిక దూరం పాటిస్తూ మాస్కులు తప్పనిసరిగా వాడాలని చేతులు ఎప్పటికప్పుడు సబ్బుతో కానీ శానిటైజర్ కానీ శుభ్రపరచుకోవాలి అని అలాగే కంచికచర్ల పట్టణంలో గత రెండు రోజులుగా తమ సిబ్బంది చె అవగాహన కల్పించడమే కాక రద్దీగా ఉన్న ప్రదేశాలలో స్టిక్కర్లు అందించడం జరుగుతుందని తెలిపారు.