అన్ని రాష్ట్రాలకు ఉచితంగా టీకా
దిల్లీ: కరోనా టీకాల పంపిణీపై కేంద్ర ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. అన్ని రాష్ట్రాలకు ఉచితంగా టీకా ఇవ్వాలని కేంద్రం నిర్ణయించింది. ఈ మేరకు ఉచిత వ్యాక్సిన్లపై కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ స్పష్టతనిచ్చింది. టీకా పంపిణీ విషయంలో కాంగ్రెస్ సీనియర్ నేత జైరాం రమేశ్ లేవనెత్తిన అనుమానాలను కేంద్రం నివృత్తి చేసింది. కరోనా వ్యాక్సిన్లను కేంద్ర ప్రభుత్వం రూ.150కే కొనుగోలు చేస్తోంది. కొనుగోలు చేసిన టీకాలను రాష్ట్రాలకు ఉచితంగా ఇవ్వనున్నట్లు కేంద్రం ట్విటర్ ద్వారా వెల్లడించింది.