పండిన పంట కి మద్దతు ధర రాకపోవడంతో మార్కెటింగ్ అధికారులు బయ్యర్లకు కుమ్మక్కు తో నిండు ప్రాణం బలి
తన కౌలు పోలంలో ప్రెటోల్ పోసుకుని ఆత్మహత్య
తెలుగు తేజం, చందర్లపాడు : చందర్లపాడు పట్టణంలో కట్ట లక్ష్మీనారాయణ అనే రైతు పంట సాగు చేసి దిగుబడి రాక అప్పుల్లో కూరుకుపోయాడు. దీంతో మనస్తాపానికి గురైన రైతు మంగళవారం రాత్రి పొలానికి వెళ్లి పెట్రోల్ పోసుకొని నిప్పంటించుకున్నాడు. పొలానికి వెళ్లిన రైతు ఎంత సేపటికీ ఇంటికి తిరిగిరాకపోవడంతో కుటుంబ సభ్యులు పొలం వద్దకు వెళ్లి చూడగా లక్ష్మీనారాయణ మృతదేహం కనిపించింది. దీంతో కుటుంబ సభ్యులు శోకసంద్రంలో మునిగిపోయారు. ఘటనపై మృతుడి బంధువులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అసలే అకాల వర్షాలకు పంట నష్టపోయి , దిగుబడి అందాక కనీసం పెట్టిన పెట్టుబడి రాని ఈ పరిస్థితుల్లో మార్కెటింగ్ అధికారులు బయ్యర్లు సరైన గిట్టుబాటు ధర ఇవ్వకపోవడంతో మనస్థాపానికి గురి అయ్యి ఆత్మహత్య చేసుకొనట్లుగా సమాచారం. లక్ష్మీనారాయణ 15 ఎకరాల పొలం కౌలుకు తీసుకొని ప్రత్తి సాగు చేస్తున్నాడు ఈ సంవత్సరం తొలకరిలో పడిన వర్షాలకు పత్తి బాగానే దిగుబడి వస్తుందేమోనని ఆశతో ఉన్న రైతుకు అకాల వర్షాల వల్ల పంట పూర్తిగా దెబ్బతిని దిగుబడి తక్కువ వచ్చింది ఎకరాకు 40 వేల రూపాయలు ఖర్చు పెట్టి 15 ఎకరాలకు గాను 8 లక్షల ఖర్చు అయినట్లు గా ఇదంతా అప్పు తీసుకొని వ్యవసాయం చేశాడని మార్కెటింగ్ అధికారులు, బయ్యార్ కుమ్మక్కుతో కనీసం మద్దతుధర రాకపోవడంతో పెట్టుబడి వస్తుందేమోననే అనుకొన్న అతనికి నిరాశను మిగిల్చింది ఈ క్రమంలో మనస్థాపానికి గురై గత అర్ధరాత్రి తన కవులు పొలంలో పెట్రోల్ పోసుకొని ఆత్మహత్య చేసుకొని మృతిచెందారు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు