తెలుగుతేజం, వత్సవాయి : వత్సవాయి మండలంలోని చిన్న మోదుగ పల్లి గ్రామ పరిధిలో కోటే వా కంపెనీ వారి డెలికేట్ పురుగుల మందు పై అవగాహన సదస్సు కార్యక్రమాన్ని శనివారం నిర్వహించారు. ఈ సందర్భంగా మార్కెటింగ్ ఐగ్జిషన్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ టి వినయ్ కుమార్ మాట్లాడుతూ కోటే వా కంపెనీ వారి డెలికేట్ మందు వాడటం వల్ల తామర పురుగు, పై ముడత పోయి చక్కటి కాపు తో అధిక దిగుబడులు వస్తాయని అన్నారు. దీని పై రైతులకు డెమో నిర్వహించి డెలికేట్ మందును పిచికారి చేసి చూపించారు. సుమారు 50 మంది రైతులు ఈ అవగాహన సదస్సు కార్యక్రమంలో పాల్గొన్నారు. రైతులకు మిరప పంటలు డెలికేట్ మందు ను ఏ విధంగా పిచికారి చేయాలి అనే విషయాన్ని వివరంగా రైతులకు అందించారు. ఒక ఎకరానికి వచ్చేసి డెలికేట్ మందులు 180ml 6 నుంచి 7 ట్యాంకులు వరకు పిచికారి చేసినట్లయితే చీకటి కాపు తో అధిక దిగుబడులు వస్తాయని దానితో రైతు సంతోషంగా ఉండవచ్చని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల మార్కెటింగ్ డెవలప్మెంట్ ఆఫీసర్ డి ఉపేంద్ర, ఎస్ గోపి, కే గోపి, మరియు గోపినేనిపాలెం చిన్న మోదుగ పల్లి గ్రామ రైతులు పాల్గొన్నారు.