*చంద్రబాబు అడుగుజాడల్లో నడుస్తూ తెలుగుజాతికి పూర్వవైభవం తేవాలి
*పరిపాలనా దక్షతతో ప్రపంచ దేశాల కళ్లు తెలుగువారి వైపు మళ్లించారు
*అంకితభావంతో తెలుగుదేశం అభ్యున్నతికి పాటుబడ్డారు :మాజీ మంత్రి దేవినేని ఉమ
విజయవాడ రూరల్ మండలం గొల్లపూడి: గొల్లపూడి గ్రామ తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా చంద్రబాబు పుట్టినరోజు వేడుకలు నిర్వహించారు. టిడిపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు తొలుత ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. అనంతరం తెలుగు తమ్ముళ్లు చంద్రబాబు పుట్టినరోజు సందర్భంగా ఏర్పాటు చేసిన భారీ కేకును ఏపీ, తెలంగాణ ఉభయ రాష్ట్రాల తెదేపా తెలుగు యువత అధ్యక్షులు శ్రీరామ్ చిన్నబాబు పొగాకు జయరాం చందర్ మరియు స్థానిక తెలుగుదేశం పార్టీ నేతలతో కలిసి కట్ చేసి శుభాకాంక్షలు తెలియజేశారు. దేవినేని ఉమా మాట్లాడుతూ, మేధస్సు, పరిపాలనా దక్షతతో ప్రపంచ దేశాల కళ్ళు తెలుగువారి వైపు తిప్పిన దార్శనికుడు చంద్రబాబు నాయుడు గారని గుర్తు చేశారు. నాలుగు దశాబ్దాల రాజకీయాల్లో నీతి, నిజాయితీలతో అంకితభావంతో తెలుగుదేశం అభ్యున్నతికి పాడుబడ్డ నాయకుడు నారా చంద్రబాబునాయుడు గారన్నారు. ఆత్మగౌరవం నినాదంతో అన్న ఎన్టీఆర్ గారు తెలుగుదేశం పార్టీ స్థాపిస్తే, తెలుగువారు ఆత్మవిశ్వాసంతో ఏదైనా చేయగలరని చంద్రబాబు నాయుడు గారు ప్రపంచానికి చూపించారని స్పష్టం చేశారు. చంద్రబాబు నాయుడు గారి అడుగుజాడల్లో నడుస్తూ మళ్లీ తెలుగుజాతికి పూర్వవైభవం తీసుకురావాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు దేశం కార్యకర్తలకు పిలుపునిచ్చారు.