తెలుగు తేజం విజయవాడ : ప్రజా సమస్యల పట్ల అత్యంత వేగంగా స్పందించడమే కాకుండా సమర్థవంతమైన అధికారిగా కృష్ణా జిల్లా కలెక్టర్ ఏ ఎం డి ఇంతియాజ్ కు రాష్ట్రవ్యాప్తంగా గుర్తింపు ఉంది. అందుకే ముఖ్యమంత్రి సైతం రాజకీయంగా ఎన్నో ఒత్తిళ్ళు ఉండే ఈ జిల్లాకు ఆయన కలెక్టర్ గా బాధ్యతలు అప్పగించడం ఆయన సమర్థతకు నిదర్శనం రాష్ట్ర వ్యాప్తంగా కురుస్తున్న భారీ వర్షాలకు ఇటీవలే విద్యాధరపురం కు చెందిన తండు శివ శంకరరావు గోడ కూలిన ప్రమాదంలో మరణించటంతో ఆయన కుటుంబానికి ప్రభుత్వం రూ .4 లక్షలు ఎక్సెగ్రేషియ మంజూరు చేసిందని జిల్లా కలెక్టర్ ఏ.యండి . ఇంతియాజ్ చెప్పారు . బుధవారం సాయంత్రం బాధితకుటుంబం నివసిస్తున్న ఇంటికి వెళ్లి కలెక్టర్ ఏ.యండి . ఇంతియాజ్ జాయింట్ కలెక్టర్ డా.కె. మాధవిలత రూ . 4 లక్షల ఎక్సెగ్రేషియ చెక ను బాధిత మరణించిన వ్యక్తి యొక్క భార్య సుజాతకు అందజేశారు . గాయపడిన సుజాత ఆరోగ్య పరిస్థితిని కలెక్టర్ ఇంతియాజ్ అడిగి తెలుసుకున్నారు . విద్యాధరపురం 4 స్తంభాల సెంటరు కొండప్రాంతంలో మంగళవారం రిటైనింగ్ గోడ కూలి దిగువనున్న ఇంటి పై పడింది . ఈ ప్రమాదంలో తండు శివశంకరరావు ( 52 ) మరణించారు . ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ * జగన్ మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు 24 గంటల్లోనే మృతిని కుటుంబానికి 4 లక్షల రూపాయలు మంజూరు చేయడమే కాకుండా సంబధిత చెక్కును జిల్లా కలెక్టర్ ఏ.యండి . ఇంతియాజ్ బాధిత కుటుంబానికి అందజేశారు .