Breaking News

బుడమేరు వాగు ముంపు ప్రాంతాల్లో సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు పర్యటన

తెలుగు తేజం : విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు స్థానిక ఒకటవ డివిజన్ లో పర్యటించారు గత రెండు రోజుల నుంచి కురుస్తున్న భారీ వర్షాల కారణంగా బుడమేరు వాగు పొంగి పొర్లుతున్న ఈ ప్రాంతాన్ని ఆయన బుధవారం పర్యటించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బుడమేరు వాగు వల్ల ఎవరికీ ఎటువంటి నష్టం ఉండదని వాగు పరిసర ప్రాంతాల్లో నివసించే వారికి ఎటువంటి ఇబ్బందులు కలగకుండా మున్సిపల్ అధికారులు అన్ని చర్యలు తీసుకుంటున్నారని ఆయన అన్నారు ఈ సందర్భంగా ఆయన అధికారులను అప్రమత్తం చేశారు.

About The Author

Related posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *