తెలుగు తేజం, కంచికచర్ల : కంచికచర్ల పట్టణంలో శివ సాయి క్షేత్రం నందు గల అయ్యప్ప స్వామి దేవస్థానం నుంచి గురువారం ఉదయం మణికంఠ భక్త బృందం ఆధ్వర్యంలో కేరళ తంత్రీ పప్పా గురు స్వామి సారథ్యంలో అయ్యప్ప స్వామి విగ్రహాల ఊరేగింపు మరియు నగర సంకీర్తనం నిర్వహించారు. స్థానిక శివ సాయి క్షేత్రం నుంచి పట్టణంలోని రహదారి తో పాటు పలు ప్రాంతాలలో ఊరేగింపు నిర్వహించి అనంతరం పరిటాల గ్రామంలో అయ్యప్ప స్వామి విగ్రహాల ఊరేగింపు నిర్వహించారు. సాయి మణికంఠ భక్త బృందం వారి మేళతాళాల నడుమ చిన్ని స్వామి అయ్యప్ప స్వామి భక్తి గీతాలాపన గావించారు.అయ్యప్పస్వామి భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామివారి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఈ సందర్భంగా పప్పా స్వామి మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ లో మొట్టమొదటి దేవస్థానం గొల్లపూడి అయ్యప్ప స్వామి దేవస్థానం అని ప్రస్తుతం ఏడు వందల అయ్యప్ప దేవస్థానాలు ఆంధ్రప్రదేశ్లో ఉన్నాయని అన్నారు. కంచికచర్ల పట్టణంలో కూడా అయ్యప్ప దేవస్థానం 18 మెట్లతో నిర్మించాలని భక్తుల సహాయ సహకారాలు అందించాలని ఆయన అన్నారు. అలాగే శివ సాయి క్షేత్రము నందు అయ్యప్ప స్వాములకు శివ స్వాములకు తిరుపతమ్మ దుర్గాదేవి స్వాములకు నిత్య అన్నదానం గత కొన్ని సంవత్సరాలుగా జరుగుతుందని కావున భక్తులు తమకు తోచిన విధంగా సహాయ సహకారాలు అందించాలని అన్నారు.