మచిలీపట్నం (తెలుగు తేజం ప ప్రతినిధి):మచిలీపట్నం అసెంబ్లీ నియోజకవర్గ జనసేన ఇన్చార్జ్ బండి రామకృష్ణ జన్మదినోత్సవ వేడుకలు శనివారం మచిలీపట్నం లో వివిధ ప్రాంతాల్లో ఘనంగా నిర్వహించారు. ఉదయం పార్టీ కార్యాలయంలో బండి రామకృష్ణ బారీ కేక్ కట్ చేశారు. ఈ సందర్భంగా జిల్లా ప్రధాన కార్యదర్శి లంకిశెట్టి బాలాజీ మాట్లాడుతూ జనసేన పార్టీ తరఫున నిరంతరం కృషి చేస్తున్న బండి రామకృష్ణ మచిలీపట్నం అభివృద్ధి కోసం కంకణబద్ధులై ఉన్నారని అన్నారు.జిల్లా ఉపాధ్యక్షులు వంపుగడవల చౌదరి మాట్లాడుతూ జనసేన పార్టీ ఇన్చార్జిగా బండి రామకృష్ణ కార్యక్రమాలు ఆదర్శప్రాయం, అభినందనీయమన్నారు.పొలాటితిప్ప,పల్లె తుమ్మల పాలెం నుండి ఆటో యూనియన్ సంఘ సభ్యులు ఊరేగింపు గా వచ్చి రామకృష్ణ కు శుభాకాంక్షలు తెలియజేశారు. 50 డివిజన్లో సిల్వర్ వర్కర్లు అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు
ఈ సందర్భంగా బండి రామకృష్ణ మాట్లాడుతూ ప్రజలకు ఎటువంటి కష్టం వచ్చినా తాను అండగా ఉంటానని తనకు అభినందనలు తెలియజేసిన వారందరికీ కృతజ్ఞతలు తెలియజేశారు. రేపు వైజాగ్ లో జరిగే పవన్ కళ్యాణ్ ఉక్కు ఫ్యాక్టరీ పరిరక్షణ సభను జయప్రదం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షుడు గడ్డం రాజు. జిల్లా పార్టీ సంయుక్త కార్యదర్శి నాగరాజు,సమీర్,వడ్డీ చిరంజీవి, డివిజన్ ఇన్ చార్జ్ లు, వీర మహిళలు జనసైనికులు పవన్ కళ్యాణ్ అభిమానులు పాల్గొన్నారు బండి రామకృష్ణ నీ శాలువాలు గజమాలతో ఘనంగా సన్మానించారు మచిలీపట్నంలో వివిధ డివిజన్ లు చెందిన నాయకులు కార్యకర్తలు రూరల్ పార్టీ నాయకులు గళ్ళ తిమోతి, నరేష్ ,నాలుగో డివిజన్ కార్పొరేటర్ పినిశెట్టి నాగదేవి తదితరులు పాల్గొన్నారు.