తైవాన్: తూర్పు తైవాన్‌లోని ఓ సోరంగంలో రైలు పట్టాలు తప్పింది. ఈ ఘటనలో ఇప్పటికే నలుగురు చనిపోయినట్లు అధికారులు ధ్రువీకరించారు. మృతుల సంఖ్య భారీగా పెరిగే అవకాశం ఉందని పేర్కొన్నారు. రైలు సగభాగం సొరంగంలోకి వెళ్లాక పట్టాలు తప్పడంతో లోపలికి చేరుకోవడం సహాయక బృందాలకు కష్టతరంగా మారింది. సొరంగంలో దాదాపు 70 మంది చిక్కుపోయారని అధికారులు చెబుతున్నారు. ఈ రైలులో 350 మంది ఉన్నారు.
కొన్ని వార్త సంస్థలు మాత్రం మృతుల సంఖ్య 36 వరకు ఉండవచ్చని చెబుతున్నాయి. మరింత సమాచారం రావాల్సి ఉంది. ఈ రైలు టైటంగ్ వెళ్తుండగా ప్రమాదం జరిగింది.