ఏలూరు జిల్లాలో దళిత వాడల దగ్గర అనుమతులు లేని, ప్రజామోదం లేని దళితవాడల్లో చేపల చెరువుల తవ్వకాలను నిలుపుదల చేయాలని రెడ్ ఫ్లాగ్ డిమాండ్ చేసింది. ఈ మేరకు మంగళవారం ఎస్సీఎస్టీ కమిషన్ రాష్ట్ర ఛైర్మన్ మారుపూడి విక్టర్ ప్రసాద్ కి డిమాండ్ లతో కూడిన వినతిపత్రాన్ని యంయల్ పిఐ(రెడ్ ఫ్లాగ్) రాష్ట్ర కమిటీ సభ్యులు కొక్కిరిగడ్డ శ్యామ్ బాబు, కొప్పుల విజయబాబులు అందజేశారు. ఆ ఫిర్యాదులో ఏలూరు జిల్లా, మండవల్లి మండలం, కానుకోలు గ్రామం దళిత కాలనీ 9 ఏకరాల చేపల చెరువు తవ్వకాలను రైతు పుట్టి సత్యనారాయణ తవ్వకాలు చేపట్టారని పేర్కొన్నారు. ఈ తవ్వకాల వలన కాలనీలోని తాగునీరు కలుషితమౌతుందని పేర్కొన్నారు. పర్యవరణ అనుమతులు. పర్యవరణ చట్టాలను ఉల్లఘీంచారని పేర్కొన్నారు. ప్రజారోగ్యచట్టం ప్రకారం గాలి, నీరు, అనారోగ్యకారకులు అనేకమైనవి ఉన్నాయని పొందుపరిచారు. పసిపిల్లలు, బాలబాలికలు, వృద్ధులు, మహిళలు చెరువు వెంబడి పయనం సాగించాలంటే ప్రాణాలు అరిచేతిలో పెట్టుకోవలసి వస్తుందని నిట్టూర్చారు. చెరువు కట్టలపై పాములు లాంటి, విషక్రీమికీటకాలు సందర్శించుతాయని, వాటి వలన ప్రాణాలకు హాని అని దుఖిఃచారు. పైగా సదరు రైతు 7 ఏకరాలు కాగా, మరో 2 ఏకరాలు దళితుడైన మాజీ సైనికుడి భూమిని కూడా ఆక్రమించి తవ్వకాలు ప్రారంభించారని ఆవేదన వ్యక్తం చేశారు. సంబంధిత రెవెన్యూ అధికారులకు ఫిర్యాదు చేసిన సమస్య పరిష్కరించకపోగా శాంతి భద్రతల సమస్యగా సెక్షన్ 144,145,r/w34 యాక్ట్ ని అమలు చేశారని కమిషన్ ఛైర్మన్ కి విన్నవించారు. ఆందోళనకు ఉపక్రమించకుండానే అరెస్టులతో పోలీసులు దళితులను భయభ్రాంతులకు గురిచేస్తున్నారని బాధను వ్యక్తం చేశారు. ఏ మేరకు కమిషన్ ఛైర్మన్ మారుపూడి విక్టర్ ప్రసాద్ సంబంధిత జిల్లా ఉన్నాధికారులకు సమాచారం అందించి, సమస్య కృషికి సహకరిస్తానని హామీ ఇచ్చారు.