తెలుగు తేజం : ఆపదలో ఉన్న రోగులకు ప్రాణాధారంగా నిలిచే వివిధ ఉపకరణాలు పెద్ద మనస్సుతో అందిస్తున్న స్వచ్ఛంధ సేవా సంస్థల సేవాతత్పరత, ఔన్నత్యం ఎంతో అభినందనీయమని రాష్ట్ర రవాణా, సమాచార పౌర సంబంధాల శాఖల మంత్రి పేర్ని వెంకట్రామయ్య ( నాని ) కొనియాడారు.సోమవారం మధ్యాహ్నం ఆయన స్థానిక జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో ఒక కార్యక్రమంలో పాల్గొన్నారు. చైల్డ్ ఫండ్ ఇండియా ,హోప్ వారి సౌజన్యంతో చైల్డ్ ఫ్రెండ్లీ కోవిడ్ కేర్ విభాగానికి వివిధ వైద్య ఉపకరణాలను నిర్వాహకులు మంత్రి పేర్ని నాని చేతుల మీదుగా ప్రభుత్వాసుపత్రికి అందిచారు. ఆక్సిజన్ కాన్సెన్ట్రేటర్లు , మల్టీ పారా మీటర్స్ ,మాస్క్ లు, నాన్ సర్జికల్ గ్లోవ్స్, పల్స్ ఆక్సీ మీటర్స్ ఆక్సిజన్ ఫ్లో మీటర్స్ తదితర ఉపయోగకరమైన అందచేశారు.ఈ సందర్భంగా మంత్రి పేర్ని నాని మాట్లాడుతూ, సేవా గుణమే వీళ్ల ఇమ్యూనిటీ అని కరోనాకు భయపడకుండా బాధితులకు సాయం చేస్తున్న స్వచ్ఛంద సంస్థల సేవలు వెల కట్టలేనివన్నారు. కోవిడ్ సమయంలో సహాయం చేసే మనుషులున్నా, సాయం చేయాలనే మనసున్నా కరోనాకి భయపడి అయినవాళ్లు సైతం బాధితుల దగ్గరకు రాలేకపోతున్నారన్నారనీ, మందులు, ఆహారం, ఆసుపత్రి అవసరాలు, అంత్యక్రియలు ఇలా దేనికీ, ఎవరూ ముందుకు రాని పరిస్థితి నిన్నా మొన్నటివరకు మన సమాజంలో నెలకొని ఉందన్నారు. కుటుంబ సభ్యులు ముందుకు రాకపోయినా, మేమున్నామంటూ పలు స్వచ్ఛంధ సంస్థలు కరోనా రోగులకు, మృతులకు సేవలు అందిస్తున్నాయిని వారికి ఏమిచ్చినా రుణం తీర్చుకోలేని అన్నారు. ఈ స్వచ్ఛంద సంస్థల్లో ఎక్కువగా యువతే పనిచేస్తున్నారని వీళ్లంతా చదువు, వ్యాపారాలు, ఉద్యోగాలు కొనసాగిస్తూనే కరోనా కష్టకాలంలో మీకు మేమున్నామంటూ ఎంతోమందికి భరోసా ఇస్తున్నారని మంత్రి వారిని అభినందించారు.
ఈ కార్య క్రమంలో మచిలీపట్నం నగర పాలక సంస్థ మేయర్ మోకా వెంకటేశ్వరమ్మ , సూపెరిండేంట్ డాక్టర్ జయ కుమార్ గారు, చైల్డ్ ఫండ్ ప్రతినిదులు సౌజన్య , రాజ్, దుర్గ , గౌరీ , షాజాద్ , యూత్ ఎంగేజ్మెంట్ వెల్ఫేర్ అసోసియేషన్ ఫౌండర్ బాజీ, ఇస్మాయిల్ , భరద్వాజ్ , చరిత్ తదితరులు పాల్గొన్నారు.