తెలుగు తేజం, నందిగామ : గత కొద్ది రోజుల క్రితం నందిగామ పట్టణంలోని దొంగలు హల్చల్ చేసి షట్టర్ తాళాలు పగలగొట్టి బట్టల షాపులో చోరీకి పాల్పడిన ఘటన లో ఎట్టకేలకు దొంగలను పట్టుకొని మీడియా ముందు హాజరు పరిచిన నందిగామ డిఎస్పీ నాగేశ్వర్ రెడ్డి గుంటూరు జిల్లాకు చెందిన ముగ్గురు వ్యక్తులు గత కొంతకాలంగా దొంగతనాలు చేస్తూ నందిగామ బట్టల షాపు, స్వీట్ హౌస్ లో షట్టర్ తాళాలు పగలగొట్టి చోరీకి పాల్పడిన దృశ్యాలు సీసీ కెమెరాల్లో నమోదయ్యాయి వీటి ఆధారంగా దొంగలను పట్టుకోవటం సులువయింది అని పాత బైపాస్ కృష్ణుడు బొమ్మలు వద్ద రోడ్డు పక్కనే చీరలో అమ్ముతుండగా అనుమానం వచ్చి విచారణ చేయగా అవి దొంగతనం చేసినవిగాదోంగలు తెలిపారు. చాకచక్యంగా వ్యవహరించి ఈ కేసును ఛేదించిన పోలీసులను డీఎస్పీ నాగేశ్వర రెడ్డి అభినందించి రివార్డులు ప్రకటించారు.