తెలుగు తేజం, జగ్గయ్యపేట : 72 వ గణతంత్ర దినోత్సవ వేడుకలును జగ్గయ్యపేట పోలీస్ స్టేషన్ లో జాతీయ జెండాను ఎగరవేసి గౌరవ వందనం సమర్పించారు. అనంతరం సిబ్బందికి మిఠాయిలు అందజేసి శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం సిటీ హైస్కూల్ నందు, బాలాజీ అపార్ట్మెంట్ లో, ఆకృతి షాపింగ్ కాంప్లెక్స్ నందు ఎస్.ఐ. చిన్న బాబు చేతుల మీదుగా జాతీయ జెండాను ఎగురవేసి గౌరవ వందనం చేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎందరో మేధావులు, త్యాగధనుల కృషిఫలితమే మనకు 1950 జనవరి 26 న అతి పెద్ద రాజ్యాంగం ఏర్పడిందన్నారు. అప్పటి నుండి ప్రతీఏటా ఈరోజున మనం గణతంత్ర దినోత్సవాన్ని ఘనంగా జరుపుకుంటున్నామన్నారు. కుల మతాలు వేరైనా మనమంతా ఒక్కటే, మనమంతా భారతీయులం అని అందరూ సోదరభావంతో మన కీర్తిని ప్రపంచ దేశాలకు చాటిచెప్పే సంస్కృతి సంప్రదాయాలకు పుట్టినిల్లు భారతదేశం అని, భారత రాజ్యాంగం పౌరులుగా మనకు ఎంతో స్వేచ్ఛ, సమానత్వపు హక్కులు ఇచ్చిందని, భావవ్యక్తీకరణ స్వేచ్ఛ, వ్యక్తి గత స్వేచ్ఛ ఇచ్చిందని వాటిని దుర్వినియోగం చేయకుండా కాపాడాల్సిన బాధ్యత మన పౌరులు అందరిపైనా ఉందని, ఆయన అన్నారు. చిన్నారులతో కాసేపు ముచ్చటించి వారితో సంభాషించారు.